Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- స్థానిక ఎన్నికల కోసం లీగల్ సెల్‌ను సిద్ధం చేయాలని సజ్జల సూచన
- ప్రతి జిల్లాలో ప్రత్యేక లీగల్ టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు
- నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు అభ్యర్థులకు న్యాయపరమైన అండ
- రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక లీగల్ వార్‌రూమ్ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలోని తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో ఆ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమైన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ లీగల్ సెల్ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ఆయన కీలక సూచనలు చేశారు. నామినేషన్ల దాఖలు నుంచి మొదలుకొని స్క్రూటినీ, పోలింగ్ , కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో న్యాయపరమైన రక్షణ, అండదండలు అందించాలని స్పష్టం చేశారు. ఈ ససమావేశంలో లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ముఖ్యనేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని ఎన్నికల న్యాయ వ్యూహాలపై చర్చించారు.
జిల్లా లీగల్ టాస్క్‌ఫోర్స్‌లు, రాష్ట్ర స్థాయిలో వార్ రూమ్
ఎన్నికల సమయంలో సమర్థవంతంగా వ్యవహరించేందుకు ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని ప్రత్యేక లీగల్ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని సజ్జల ఆదేశించారు. నామినేషన్ల సమయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు రాకుండా అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్, ఎన్ఓసీ (NOC), పోలీస్ క్లియరెన్స్ వంటి పత్రాలను ముందుగానే సిద్ధం చేయాలని తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో లీగల్ సెల్ ప్రతినిధులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని చెప్పారు. అవసరమైన చోట ప్రతి మండలానికి ఒక న్యాయవాదిని అందుబాటులో ఉంచాలని, సమస్యాత్మక నియోజకవర్గాలు , ప్రాంతాలను ముందే గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, రాష్ట్ర స్థాయిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘లీగల్ వార్‌రూమ్’ తరహా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
Also Read
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
అక్రమ కేసులపై ధీటుగా పోరాటం.. యువ న్యాయవాదులకు ప్రాధాన్యం
ఒకవేళ నామినేషన్ల తిరస్కరణ జరిగితే తక్షణమే స్పందించి సంబంధిత అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించేలా వేగవంతమైన వ్యవస్థ ఉండాలని సజ్జల పేర్కొన్నారు. అధికారులు లేదా పోలీసుల ద్వారా అభ్యర్థులపై అక్రమ కేసులు బనాయించినా, వేధింపులకు గురిచేసినా చట్టపరంగా ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు పూర్తిగా పూర్తయ్యేంత వరకు న్యాయవాదులు అభ్యర్థులకు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో సీనియర్, అనుభవజ్ఞులైన న్యాయవాదులతో పాటు యువ న్యాయవాదుల సేవలను కూడా విస్తృతంగా వినియోగించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!