AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Drought: ఇటీవలే కూటమి ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్‌లో కరువు మండలాల ప్రకటనపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా ప్రజలను, రైతులను, వ్యవసాయ కూలీలను నిరాశపరిచిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించి, అందుకు తగిన ప్రత్యేక ప్యాకేజీని అందించాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్లో ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. రాష్ట్రంలో 544 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం 388 మండలాలను మాత్రమే ప్రకటించిందని విమర్శించారు. వీటిలో 283 మండలాలను తీవ్ర కరువు, 105 మండలాలను మధ్యస్థ కరువుగా ప్రభుత్వం వర్గీకరించారని తెలిపారు..
కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం నుంచి తగిన సహాయాన్ని పొందాలని శ్రీనివాసరావు కోరారు. పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ డ్రాట్ మాన్యువల్-2016ను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగిన సమయంలో స్పందించలేదని ఆయన ఆరోపించారు. తాజాగా 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించడాన్ని కూడా శ్రీనివాసరావు ప్రశ్నించారు. కరువు తీవ్రతను దృష్టిలో పెట్టుకుంటే మరిన్ని ప్రాంతాలను జాబితాలో చేర్చాల్సి ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం, పల్నాడు ప్రాంతాలతో పాటు గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లోని పశ్చిమ మండలాలు, డెల్టా ప్రాంతాల్లోని చివరి భూములు కూడా వర్షాభావంతో ఎండిపోయాయని పేర్కొన్నారు.
Also Read
- AP Municipal Elections 2026: ఏపీలో ఎన్నికల సందడి.. 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్..
- AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల నగారా.. నేడు ఎస్ఈసీ కీలక ప్రకటన!
- Vijayasai Reddy: ఏపీ రాజకీయాల్లో సాయిరెడ్డి మరో సంచలనం.. 2029 ఎన్నికలపై కీలక ప్రకటన.. పీఆర్పీ టార్గెట్ 175..!
- Vijayasai Reddy: రెండు కుటుంబాల ఆధిపత్యానికి చరమగీతం పాడాలి.. PRP పవర్ చూపిస్తా.. సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
వర్షాలు లేక పలు ప్రాంతాల్లో పంటలు సాగు చేయని భూములు ఖాళీగా ఉన్నాయని శ్రీనివాసరావు తెలిపారు. రైతులు పెట్టిన పెట్టుబడులను నష్టపోయారని, వ్యవసాయ కూలీలకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులపై దృష్టి సారించే క్రమంలో గ్రామీణ ప్రజలు, పేదలు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలను విస్మరిస్తోందని శ్రీనివాసరావు విమర్శించారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో జీవనోపాధి, వ్యవసాయం, తాగునీరు తదితర అంశాలపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్రాన్ని కరువు పరిస్థితుల నుంచి ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు. రైతులకు, వ్యవసాయ కూలీలకు తక్షణ ఉపశమన చర్యలు అందించడంతో పాటు కేంద్రం నుంచి ప్రత్యేక సహాయాన్ని పొందేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు..
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!