Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- పాన్ ఐఐటీ సమ్మిట్‌లో స్టార్టప్‌ల ఆవిష్కరణలు పరిశీలించిన సీఎం
- కొన్ని గంటల్లోనే పెట్రోల్ బైక్‌ను ఈవీగా మార్చే టెక్నాలజీ
- ఏపీలో ఈవీ కన్వర్షన్ ప్రాజెక్ట్‌కు చర్యలు చేపట్టాలని ఆదేశం
- స్వర్ణాంధ్ర-10పై చిన్నారుల ఐడియాలకు చంద్రబాబు ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pan IIT Summit : విజయవాడలోని అంబేడ్కర్ కళావేదికలో నిర్వహించిన ‘పాన్ ఐఐటీ’ (Pan-IIT) సమ్మిట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సమ్మిట్ ప్రాంగణంలో ఐఐటీయన్లు, వివిధ స్టార్టప్‌లు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన స్టాళ్లను ఆయన ఆసక్తిగా సందర్శించారు. ఈ సందర్భంగా ‘ఆక్సి ఏరోస్పేస్’ సంస్థ వినూత్నంగా రూపొందించిన డ్రోన్‌ను సీఎం నిశితంగా పరిశీలించారు. సంస్థ ప్రతినిధుల కోరిక మేరకు సదరు డ్రోన్‌పై స్వయంగా సంతకం చేసి, వారి ఆవిష్కరణను అభినందించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఐఐటీయన్లు రూపొందించిన పలు నూతన సాంకేతిక ఉత్పత్తులు, స్టార్టప్ ఆలోచనల గురించి ముఖ్యమంత్రి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
పెట్రోల్ వాహనాల ఈవీ కన్వర్షన్.. ఏపీకి తీసుకురావాలని ఆదేశం
ప్రదర్శనలో భాగంగా పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలను కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాలు)గా మార్చే సాంకేతికతను ప్రదర్శించిన స్టార్టప్ స్టాల్‌ను చంద్రబాబు ప్రత్యేకంగా సందర్శించారు. సాధారణ టూవీలర్లను ఈవీలుగా కన్వర్ట్ చేసే సులువైన విధానాన్ని స్టార్టప్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్న ఆయన, ఈ వినూత్న ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. దీనితో పాటు, మనిషి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా నిమిషాల వ్యవధిలోనే ప్రాథమిక హెల్త్ రిపోర్టును అందించే ప్రత్యేక యాప్‌ను రూపొందించిన మరో సంస్థ స్టాల్‌ను కూడా సీఎం పరిశీలించారు. ఈ యాప్ పనితీరును ప్రశంసించారు.
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
‘స్వర్ణాంధ్ర-10’ సూత్రాలపై చిన్నారుల ప్రెజెంటేషన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘స్వర్ణాంధ్ర-10’ సూత్రాల సమర్థవంతమైన అమలులో ఆధునిక సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో వివరిస్తూ పలువురు చిన్నారులు తమ ఐడియాలను ముఖ్యమంత్రికి ప్రెజెంట్ చేశారు. చిన్నారులు చూపిన సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల ఆలోచనలను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. అనంతరం చిన్నారులతో కలిసి సీఎం గ్రూప్ ఫోటో దిగారు.
తాజావార్తలు
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!