MLC Nagababu Review on HHVM Movie: ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ జులై 24న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన వీరమల్లు చిత్రం మిశ్రమ స్పందనకే పరిమితమైంది. అయితే సినిమాలో పవన్ నటన, యాక్షన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వీరమల్లు సినిమాను పవన్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు వీక్షించారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. సినిమాపై వైసీపీ పార్టీ దుష్ప్రచారం…
నాకు పదవుల మీద ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాకు పదవులపై ఆశ లేదు.. కానీ, జనసేన కార్యకర్తగా ఉండటమే నాకు ఇష్టం అన్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డక జనసేనలో ఎటువంటి కమిటీ వేయలేదు... జనసేన సైనికులు ఓర్పుతో పార్టీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు..
MLC Nagababu: ప్రమాదవశాత్తు మరణించిన 101 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ. 5 కోట్ల 5 లక్షలు బీమా చెక్కులను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియని సందర్భం.. ఇక్కడికి వచ్చిన చాలా మంది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి వచ్చిన వారే అన్నారు.
ఎమ్మెల్సీ నాగబాబుకు ఏపీ కేబినెట్ బెర్త్ దక్కుతుందా? లేదా? ఉన్న ఒక్క ఖాళీని భర్తీ చేసి ఆయనకు మంత్రి పదవి ఇస్తారా? లేక అలాగే వదిలేస్తారా? నాగబాబును మంత్రిని చేస్తానని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పాక కూడా ఇంకా మీన మేషాలు ఎందుకు? లెక్కలు ఎక్కడో తేడా కొడుతున్నాయా? అసలు ఎమ్మెల్సీకి సైరన్ కార్ యోగం ఉందా? లేదా? ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన్ని మొదట రాజ్యసభకు పంపాలనుకున్నా……
MLC Nagababu: జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు నాగబాబు ఈ రోజు (ఏప్రిల్ 5న) పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో తెలుగు దేశం, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది.
ఎమ్మెల్సీ నాగబాబు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో పర్యటిస్తున్నారు. గొల్లప్రోలు మండలంలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్న క్యాంటీన్‌ను నాగబాబు ప్రారంభించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా టీడీపీ-జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. అన్న క్యాంటీన్‌ను నాగబాబు ఓపెన్ చేస్తుండగా.. జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జై జనసేన అంటూ జనసైనికులు కౌంటర్ నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో…
MLC Nagababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఈ రోజు (ఏప్రిల్ 3న) జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.