MLC Nagababu: ప్రమాదవశాత్తు మరణించిన 101 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ. 5 కోట్ల 5 లక్షలు బీమా చెక్కులను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియని సందర్భం.. ఇక్కడికి వచ్చిన చాలా మంది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి వచ్చిన వారే అన్నారు.
జనసేన పార్టీ క్రియా శీలక సభ్యత్వం చేయించుకొని ప్రమాదవశాత్తు మృతి చెందిన క్రియాశీలక మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు బకాయి పెట్టి వెళ్ళిపోయిన ప్రభుత్వం ఒక్క వైసీపీ మాత్రమేనని ఆరోపించారు.