ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయబాబు చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పటికే డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి కేసులో ఆయనపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఎమ్మెల్సీ. ఈ అంశంపై విపక్షాల వాయిస్ పెరగడంతో రచ్చ రచ్చ అవుతోంది. దీంతో అనంతబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం. జిల్లాకు చెందిన వైసీపీ నేతలు.. మంత్రులుతో ఆయన టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు…
కాకినాడ జీజీహెచ్ దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యం కేసు మరింత జఠిలంగా మారింది. సుబ్రమణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. అయితే పోస్టుమార్టం జరిగితే తప్ప ఈ కేసు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. తొలుత భార్య అంగీకారంతో పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించినా అనంతరం కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను బలవంతంగా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం సుబ్రమణ్యం భార్య కూడా…