కాకినాడలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం సాయంత్రం వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇప్పటికే ఈ హత్య కేసులో తన తప్పిదాన్ని అనంతబాబు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. Konaseema: కోనసీమలో మళ్లీ మొదలైన టెన్షన్.. షాపులన్నీ క్లోజ్ అనంతబాబు వాంగ్మూలం, ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలను…
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వెల్లడించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబే హత్య చేసినట్లు ఆయన తెలిపారు. ఈనెల 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంట్లో నుంచి బయటకు వచ్చాడని.. శ్రీరామ్‌నగర్‌లో మిత్రులతో కలిసి రాత్రివేళ సుబ్రహ్మణ్యం మద్యం సేవించాడని ఎస్పీ వివరించారు. అదే సమయంలో ఆ ప్రాంతానికి ఎమ్మెల్సీ అనంతబాబు వెళ్లి సుబ్రహ్మణ్యాన్ని తన కారులో తీసుకెళ్లారని చెప్పారు. సుబ్రహ్మణ్యం…
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అలియాస్ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసిన అనంతరం రహస్య ప్రదేశంలో పోలీసులు అనంతబాబును విచారించారు. విచారణలో భాగంగా ఆయనకు కాకినాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. కాకినాడ జిల్లా కోర్టుకు వేసవి సెలవులు కావడంతో స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి చల్లా జానకి ముందు అనంత…
ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కారులో డెడ్‌బాడీ దొరికిన అంశం హాట్ టాపిక్‌గా మారింది. నిందితుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే చట్టం ముందు అందరూ సమానులేనని.. తప్పు చేసింది ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వైసీపీ మంత్రులు క్లారిటీ ఇస్తున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన…
కాకినాడ జీజీహెచ్ దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యం కేసు మరింత జఠిలంగా మారింది. సుబ్రమణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. అయితే పోస్టుమార్టం జరిగితే తప్ప ఈ కేసు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. తొలుత భార్య అంగీకారంతో పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించినా అనంతరం కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను బలవంతంగా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం సుబ్రమణ్యం భార్య కూడా…