Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు సంచలన విషయాలను వెల్లడించారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసుగా హైకోర్టుకు, లోయర్ కోర్టుకు ఇప్పటివరకు చెబుతూ వచ్చిన సిట్, తాజాగా ఏ4 సురేష్ రిమాండ్ రిపోర్టులో కీలక నిజాలను నివేదించింది. పోలీసులు విపరీతంగా కొట్టడం వల్లే సాయికృష్ణ మృతి చెందాడని సిట్ స్పష్టం చేసింది.
విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని సాయికృష్ణను దారుణంగా కొట్టారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. పోలీసుల దెబ్బల కారణంగా గాయాలపాలైన సాయికృష్ణ పోలీస్‌స్టేషన్‌లోనే చనిపోలేదని, స్టేషన్లో ఉంచితే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో సీఐ నాగరాజు ఆదేశాల మేరకు క్షతగాత్రుడైన సాయికృష్ణను రాణిగారి తోటలోని ఒక ప్రైవేట్ పాడుబడ్డ భవనానికి తరలించినట్లు సిట్ తెలిపింది.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
మే 12, 2026వ తేదీన సీఐ నాగరాజును కలవడానికి వెళ్లిన సురేష్.. రాణిగారి తోటలోని ఖాళీ భవనంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న సాయికృష్ణను ప్రత్యక్షంగా చూసినట్లు వెల్లడైంది. ఆ తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని సురేష్, సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్ కలిసి ఆయా తేదీల్లో దహనం చేశారని, ఎవరికీ ఎలాంటి ప్రాథమిక, సాంకేతిక ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని పూర్తిగా మాయం చేసి ధ్వంసం చేశారని సిట్ కోర్టుకు వివరించింది.
సీసీ కెమెరాలు, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ లభించకుండా నిందితులందరూ కలిసి ముందుగానే చాలా జాగ్రత్తపడ్డారని సిట్ పేర్కొంది. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురు నిందితులను కూలంకషంగా విచారించిన అనంతరం సాయికృష్ణ పోలీసుల దెబ్బల వల్లే హత్య చేయబడ్డాడని సిట్ నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి ఈనెల 24 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.
తాజావార్తలు
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!