AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు మరోసారి షాక్ తగిలినట్టు అయ్యింది.. నిందితుల బెయిల్ పిటిషన్ల మీద విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. దీంతో, మొత్తం ఏడుగురు నిందితుల బెయిల్ పిటిషన్ల మీద ఈ నెల 24వ తారీఖున తీర్పు వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు పేర్కొంది. అయితే, అప్పటి వరకు నిందితుల రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న…
Honeymoon Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘‘హనీమూన్ మర్డర్ కేసు’’లో కీలక పరిణామం ఎదురైంది. నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. పెళ్లయిన కొన్ని రోజులకు భర్త రాజ రఘువంశీని హనీమూన్ కోసం మేఘాలయకు తీసుకెళ్లి కిరాయి హంతకులతో హతమార్చింది. ఈ హత్యలో సోనమ్ కీలక నిందితురాలు కాగా, ఈ హత్యను తన ప్రియుడు రాజ్ కుశ్వాహతో కలిసి ప్లాన్ చేసింది. రాజా రఘువంశీని ముగ్గురు కిరాయి హంతకులు సోహ్రాలోని వీసావ్‌డాంగ్ సమీపంలో…
MP Midhun Reddy: లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. దానితో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిధున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరచడానికి తీసుకుని వెళ్లుతున్నారు. ఎస్కార్ట్ సిబ్బంది, ఏసీబీ పోలీసులు ప్రత్యేక వాహనంలో రాజమండ్రి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి రిమాండ్ నేటితో ముగియనుంది. రిమాండ్ పొడిగింపు నిమిత్తం విజయవాడ…
Midhun Reddy: అమరావతిలో మద్యం స్కాం (లిక్కర్ కేసు) సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరపనుంది. సిట్ (Special Investigation Team) హైకోర్టులో కీలక కౌంటర్ దాఖలు చేసింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్‌ను తిరస్కరించాలని కోరుతూ, ఆయనపై పలు ఆరోపణలు చేసినట్లు సమాచారం. సిట్…
బంగారం అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్న కన్నడ నటి రన్యా రావుకు మరో షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను బెంగళూరులోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది.
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావు భర్త జతిన్ హుక్కేరి అరెస్టు నుండి మినహాయింపు కోరాడు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అతనికి కర్ణాటక హైకోర్టు గత మంగళవారం ఉపశమనం ఇచ్చింది. హైకోర్టు తదుపరి విచారణ జరిగే వరకు జతిన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
సినీనటుడు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్‌పై నేడు కర్నూలు కోర్టులో విచారణ జరగనుంది.. పోసాని బెయిల్ పిటిషన్ పై ఈ రోజు కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టు విచారణ చేపట్టనుంది.. మరోవైపు, పోసాని కస్టడీ పిటిషన్ పై ఇప్పటికే తీర్పు రిజర్వు చేసింది కోర్టు.. గత 5 రోజులుగా కర్నూలు జైలులో రిమాండ్‌లో ఉన్నారు పోసాని..
పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన న్యాయ వాది మధు.. రైల్వేకోడూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, రేపటి నుంచి రైల్వే కోడూరు జడ్జ్ ట్రైనింగ్ కోసం వెళ్తున్న కారణంగా ఈ కేసును శుక్రవారం విచారణకు తీసుకోలేదు. ఇక, శనివారం, ఆదివారం సెలవు కావడంతో సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది..
Nandigam Suresh: అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ హత్య కేసులో తనకు రెగ్యులర్ బెయిలు మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ బుధవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.