Nupur Sharma Controversy : విదేశాల్లో నిరసన జ్వాలలు.. కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ ఇటీవల మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాకుండా ముస్లిం దేశాలలో సైతం ఆగ్రహజ్వాలలు రగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నుపుర్ శర్మ వ్యాఖ్యలపై కువైట్‌లో ప్రవాసులు నిరసనలు చేపట్టారు. దీంతో కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిరసనకారులకు హెచ్చిరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో వారిని అరెస్ట్ చేసిన జైళ్లకు తరలిస్తున్నారు. తమ దేశంలో ప్రవాసులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టడం నిషిద్ధమని, నిబంధనలను ఉల్లంఘించి నిరసన ప్రదర్శనలు చేపట్టిన విదేశీయులను వారి సొంత దేశాలకు తిప్పిపంపుతున్నట్టు కువైట్ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
ప్రస్తుతం తమ అధికారులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న వారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారని, అనంతరం వారి స్వదేశాలకు తరలిస్తారని కువైట్ ప్రభుత్వం వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మరోసారి వాళ్లు కువైట్ లో ప్రవేశించడంపై నిషేధం ఉంటుందని, అయితే.. నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న వారు ఏ ఏ దేశాలకు చెందినవారన్నది మాత్రం వెల్లడించలేదు కువైట్ ప్రభుత్వం.
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
తాజావార్తలు
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!