MLA Prasanna Kumar: పవన్ ఎన్ని సభలు పెట్టి వైసీపీని తిట్టినా.. మళ్లీ మేమే గెలుస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Nallapureddy Prasanna Kumar Comments On Pawan Kalyan Varahi Yatra: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అయిన పవన్ కళ్యాణ్.. ఎన్ని వారాహి యాత్రలు చేసినా, ఎన్ని సభలు పెట్టి వైసీపీని తిట్టినా.. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఏదో ఒక విధంగా సీఎం జగన్మోణ్ రెడ్డికి ఇంటికి పంపించాలని కొన్ని విష సర్పాలు బయలుదేరాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసం మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటయ్యారని వ్యాఖ్యానించారు. పవన్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని.. ఇప్పటికే ఆయన ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Thalapathy Vijay: అదే చివరి సినిమా.. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం?
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
చంద్రబాబు దగ్గర సూట్‌కేసులు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్.. ఏరోజూ తాను ముఖ్యమంత్రి అవుతానని చెప్పలేదని ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే అయితే చాలు, శాసనసభలో అడుగుపెట్టాలని పవన్ అనుకుంటున్నాడే తప్ప.. ముఖ్యమంత్రి కావాలని ఆయన లేదన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలన్నదే ఆయన ప్రయత్నమని అభిప్రాయపడ్డారు. ప్రజలు అమాయకులేం కాదని.. రాజకీయ నాయకులు కన్నా చాలా తెలివైన వారని.. చంద్రబాబు, పవన్ కుమ్మక్కై చేస్తున్న రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పవన్ ఎన్ని మాటలు మాట్లాడినా.. ఎంత విషపు ప్రచారం చేసినా.. సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరంటూ తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్నే శాశ్వత ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారని వెల్లడించారు.
Adipurush : మాట మార్చిన ఆదిపురుష్ రైటర్.. అప్పుడలా, ఇప్పుడిలా!
ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు, కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏం వెలగబెట్టాడని ప్రసన్న కుమార్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజల్ని, కొత్త రాష్ట్రాన్ని పూర్తిగా మర్చిపోయాడని మండిపడ్డారు. టీడీపీ హయాంలో చంద్రబాబు, నారా లోకేష్ మాత్రం కోటీశ్వరులు అయ్యారే తప్ప.. పేదలు మాత్రం పేదవాళ్లుగానే ఉండిపోయారన్నారు. ఆ పేదరికాన్ని నిర్మూలించాలనే జగన్ పని చేస్తున్నారని చెప్పారు. పేదవాళ్లు ఆర్థికంగా ఎదగడం కోసం.. సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!