Venkat Prabhu Film is Thalapathy Vijay’s Last Film: చివరిగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారిసు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి. ఆ సినిమాని తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేసినా ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతానికి విజయ్ లియో అనే సినిమాలో నటిస్తున్నాడు. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో విజయ్ సాసన త్రిష నటిస్తుండగా ఒక కీలక పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నారు. ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 19వ తేదీన విడుదల కావడానికి రంగం సిద్ధమవుతోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సుమారు 250 నుంచి 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తోంది. తమిళ భాషలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు సహా ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అదే విజయ కెరీర్ లో చివరి సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని విజయ్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నట్టు మనందరికీ తెలుసు. అయితే ఎందుకో కానీ ఆ విషయాన్ని ఆయన వాయిదా వేస్తూ వచ్చాడు. ఆయన పేరు మీద ఆయన తండ్రి ఒక రాజకీయ పార్టీ స్థాపించి కొన్ని ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కానీ అవేవీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో వెంకట్ ప్రభు సినిమా పూర్తి చేసి విజయ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఆయన పోటీకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. దానికి ఊతం ఇచ్చే విధంగానే తాజాగా ఒక కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో సమావేశమై ప్రస్తుత రాజకీయాలపై విజయ్ సెటైర్ వేసినట్లుగా చెబుతున్నారు. మీరే కాబోయే ఓటర్లు మీరే మంచి లీడర్లను రాబోయే కాలంలో ఎన్నుకోబోతున్నారని చెబుతూ డబ్బు తీసుకుని ఓటు వేయడం అంటే మనకన్ను మనమే గుచ్చుకోవడం అంటూ కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారని అంటున్నారు.
ఒక్కో ఓటుకి ఒక్కొక్క రాజకీయ నాయకుడు వెయ్యి చొప్పున లక్షణాల మందికి 15 కోట్ల రూపాయలు పంచి పెడుతున్నాడు అంటే దానికి ముందు అతను ఎంత సంపాదించి ఉంటాడు ? ఒకవేళ గెలిస్తే ఎంత సంపాదిస్తాడో అనే విషయాలన్నీ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. మీరందరూ వచ్చే ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్నారు డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలని మీరు ఆ పని చేయడమే కాదు మీ తల్లిదండ్రులకు కూడా చెప్పాలని విజయ్ సూచించారు. పీపుల్స్ మూమెంట్ అనే సంస్థ ద్వారా 10 12వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు విజయ చేతుల మీదుగా అవార్డులు అందించారు. అయితే విజయ్ నిజంగానే వెంకట్ ప్రభు సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల్లోకి దిగుతాడా? లేక నిన్న మాట్లాడిన మాటలను ఆధారంగా చేసుకుని తమిళ మీడియాలో ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు తెరమీదకి వస్తున్నాయా అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.