Minister Venugopala Krishna Fires On Pawan Kalyan Varahi Yatra: పవన్ కళ్యాణ్ పూటకో వేషం వేస్తున్నాడని.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడని మంత్రి వేణుగోపాల కృష్ణ ధ్వజమెత్తారు. చంద్రబాబు వల్ల పుష్కరాల్లో 29 మంది చనిపోతే.. పవన్ ఒక్కసారైనా దాని గురించి మాట్లాడాడా? అని ప్రశ్నించారు. శనివారం మంత్రి వేణు మాట్లాడుతూ.. తన వారాహి యాత్రలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై పవన్ చేసిన ఆరోపణల్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. పవన్ స్థిరత్వం లేని వ్యక్తి అని.. ముఖ్యమంత్రి పదవిని ఆశించడం లేదని చెప్పే పవన్, ఇస్తే మాత్రం ఆ పదవిని తీసుకుంటానని అంటున్నాడని పేర్కొన్నారు. నువ్వు చేసిన తప్పదాల గురించి నీ మనస్సాక్షిని అడుగు అంటూ సూచించారు. తప్పులు ఉంటే చెప్పాలి కానీ చెప్పులు చూపిండం ఏమాత్రం సరికాదన్నారు.
Mint Leaves Benfits: పుదీనా ఆకులతో ఎన్నో ప్రయోజనాలు.. ఆ సమస్యతో బాధపడుతున్న వారు తప్పక తీసుకోవాలి!
జనసేన కార్యకర్తలపై పవన్ బండరాయి వేస్తున్నాడని మంత్రి వేణు పేర్కొన్నారు. కుల ప్రస్తావన లేకుండా ఏ సభలోనూ పవన్ మాట్లాడలేడని దుయ్యబట్టారు. చిరంజీవి కష్టపడి సంపాదించిన ఇమేజ్.. పవన్‌కి లభించిందని ఎద్దేవా చేశారు. పవన్.. పిఠాపురంలో నీవు మాట్లాడిన ధర్మ పరిరక్షణ వల్లించిన సూక్తులు ఏనాడైనా పాటించావా? అని నిలదీశారు. ధర్మభక్షణ చేసే వ్యక్తి పక్కన నువ్వున్నావంటూ.. పరోక్షంగా చంద్రబాబుపై కౌంటర్ వేశారు. పవన్ సినిమాల్లో హీరో కావచ్చేమో గానీ.. రాజకీయాల్లో మాత్రం జీరో అని ప్రజలకు అర్థమైందని చురకలంటించారు. గోదావరి జిల్లాలో నీ సామాజిక వర్గానికి సమస్య వచ్చినప్పుడు ఎక్కడున్నావ్ పవన్? అని అడిగారు. రైతులకు, మహిళలకు, చిన్నారులకు, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తోందని.. ఇవేవీ నీకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నారాహి యాత్రను ప్రజలు ఏమాత్రం పట్టించుకోరంటూ సెటైర్లు వేశారు.
Seediri Appalaraju: పవన్ కళ్యాణ్‌పై మంత్రి సీదిరి సెటైర్లు.. సీఎం పదవి ముష్టి అడిగితే వచ్చేది కాదు
గతంలోనూ పవన్ కళ్యాణ్‌పై మంత్రి వేణుగోపాల్ హాట్ కామెంట్లు చేశారు. పవన్ ఓ అపరిపక్వ నాయకుడని, కేవలం స్పెషల్ ప్యాకేజీల కోసమే పవన్ పొత్తులు పెట్టుకుంటాడని ఆరోపించారు. జనసైనికుల ఆశల మీద పవన్ నీళ్లు చల్లాడని, తనని నమ్మిన వాళ్లను పవన్ దగా చేశాడంటూ మండిపడ్డారు. పవన్ చేసిన పని కారణంగా.. 2014-19లో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఆ మధ్యకాలంలో జరిగిన తప్పుల్లో పవన్ కూడా వాటాదారుడని చెప్పారు. పవన్ స్వతంత్రంగా గెలవలేడని.. ఏ లక్ష్యాలతో జనసైనికులు పవన్‌కి మద్దతు ఇచ్చారో, అది తాను చేయలేనని చెప్పేశాడంటూ మంత్రి వేణుగోపాల్ చెప్పుకొచ్చారు.