Minister Seediri Appalaraju Says YS Jagan Will Be CM Forever: ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టిన అరిష్టమని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో ఎక్కడా పేదలకు భూమి ఇవ్వలేదని ఆరోపించారు. కానీ.. తమ వైపీసీ ప్రభుత్వంలో అన్ని కులాలు, మతాలవారికి 50వేల మందికి ఇల్లు పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఇన్నాళ్లు కమ్మరావతిగా చెప్పుకునే అమరావతిలో ఇప్పుడు నిజమైన పండగ జరిగిందని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ అమరావతిలో పేదలకు ఇల్లు ఇవ్వొద్దని కోరుతున్నారని, పేదలకు ఇల్లు ఇవ్వొద్దన్న కమ్యునిస్ట్‌లు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉండరని విమర్శించారు. అయితే.. తాము కోర్టులలో సైతం పోరాటం చేసి విజయం సాధించామని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని, ఇది పేదల విజయం, సీఎం జగన్ విజయమని చెప్పారు.
Sitaram Yechury: మోదీ చర్యలు ఫ్యూడల్ నిరంకుశత్వాన్ని సూచిస్తాయి
అమరావతిలో పేదల ఇళ్లపట్టాల పంపిణీ.. పెట్టుబడి దారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమని మంత్రి సీదిరి పేర్కొన్నారు. సినిమాల్లో విలన్ రెండున్నర గంటలు విజయం సాధిస్తాడు కానీ చివరికి క్లైమాక్స్‌లో హీరోనే విజయం వరిస్తుందని అన్నారు. డెమెగ్రాఫికల్ ఇంబ్యాలన్స్ వస్తుందని మాట్లాడుతారా? మీ బాబులు, వాళ్ల బాబులు, జేజమ్మలు వచ్చినా ప్రభుత్వం మారదని తేల్చి చెప్పారు. జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. సీఆర్‌డీఏ చట్టంలో పెట్టామంటున్న చంద్రబాబు.. 5 శాతంలో ఒక్క శాతమైనా పేదలకు భూమి ఇచ్చారా? అని ప్రశ్నించారు. తాము 32 లక్షల మందికి ఇల్లు ఇస్తామని చెబుతున్నామని, మరి చంద్రబాబు ఎన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు సహకరించకపోయినా పర్వాలేదు కానీ, కాళ్లు పట్టుకోని లాగొద్దని సూచించారు. నాడు చంద్రబాబు రెవెన్యూ లోటు అడిగారా, లేక కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ అడిగారా? అని నిలదీశారు. ప్యాకేజ్ అడిగిన బాబు వ్యవహరం చూసి.. తమకు మంచి జరగదని ప్రజలు భావించి ఉండి ఉంటారని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ శ్రమను చూసి.. కేంద్రం నిధులు విడుదల చేసిందని స్పష్టం చేశారు.
KA Paul: నేను, జగన్ కలిస్తే.. చంద్రబాబు కుప్పంలో ఓడిపోతాడు
బిజెపి ఒక పార్టీగా బలోపేతం అవుతుందని.. వైసీపీని బీజేపీ వాళ్లు ఎందుకు బలోపేతం చేస్తారని మంత్రి సీదిరి ప్రశ్నించారు. మేం సింగిల్‌గానే పోటీ చేస్తామని సీఎం జగన్ చెప్తున్నారని.. కానీ చంద్రబాబు ఎందుకు సింగిల్‌గా వస్తామని చెప్పలేకపోతున్నారని నిలదీశారు. ఎందుకంటే.. చంద్రబాబుకు అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ, జనసేన కలిసి వస్తామని స్వయంగా చంద్రబాబే చెప్పుకుంటున్నారని అన్నారు. తాము ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని, అసలు అందుకు అవకాశం కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అదోగతిపాలు చేశారని విమర్శించారు. తాము అనుకున్న పనులన్ని పూర్తి చేసుకొని, సమయం అయ్యాకే ఎన్నికలకు వెళ్తామన్నారు. అచ్చెంనాయుడు వార్తలకు స్కోప్ లేకనే.. మహానాడుకు బస్సులు ఇవ్వలేదంటూ ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. డబ్బులు కడితే ఆర్టీసీ బస్సులు ఇస్తుందని.. ఏపీఎస్ఆర్టీసీ ఎవ్వరికీ ఉచితంగా బస్సులు ఇవ్వదని చెప్పుకొచ్చారు.