Minister Roja: పవన్ కళ్యాణ్‌కు చిన్న మెదడు చితికింది.. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja Fires On Pawan Kalyan Over AP Volunteer Issue: ఏపీ మంత్రి ఆర్కే రోజా మరోసారి జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌కు చిన్న మెదడు చితికిపోయిందని, అందుకే వాలంటీర్లపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. వాలంటీర్లేమో రోబోలు గానీ, బయటి వ్యక్తులు గానీ కాదని.. మీ ప్రాంతానికి చెందిన మీలో ఒకరికే వాలంటీర్ బాధ్యతలు అప్పగించామని తెలిపారు.
Thota Trimurthulu: రామచంద్రపురంలో సీటు ఎవరికి ఇవ్వాలో హైకమాండ్‌దే నిర్ణయం
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
- Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
- Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్‌కి పాల్పడుతున్నారని, ప్రేమించుకొని పారిపోతున్నారని, భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. వాలంటీర్లను కేవలం ఇదొక్కటే చేయమని తామేమీ ఒత్తిడి చేయడం లేదని.. వాలంటీర్ పనులు చేస్తూనే చదువుకోవచ్చని, ఇతర ఉద్యోగాలకు అప్లై చేయొచ్చని మంత్రి రోజా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన పిచ్చి వ్యాఖ్యల్ని నమ్మకుండా.. ఇలాంటివన్నీ గమనించాలని అన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రజలకు అన్నీ అందుతుండటం చూసి సహించలేకే.. ప్రతిపక్షాలు ఇలా ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు. ఒకవేళ వాలంటీర్లకు పైస్థాయి ఉద్యోగాలు వస్తే, అందుకు ప్రభుత్వం అండగా కూడా ఉంటుందని హామీ ఇచ్చారు.
Taneti Vanitha: అత్యాచారానికి గురై మృతిచెందిన మైనర్ బాలిక కుటుంబానికి 10 లక్షల ఆర్థికసాయం
ఇక చంద్రబాబుకి వయసు పెరిగేకొద్దీ చాదస్తం ఎక్కువైందని.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనేమీ చేయలేదని రోజా ధ్వజమెత్తారు. అప్పట్లో రాష్ట్రాన్ని విడగొట్టారని, ఏపీ సీఎంగా అయ్యాక అభివృద్ధివైపుకు రాష్ట్రాన్ని నడిపించలేదని, కనీసం ప్రజలకు ఒక్క పథకం కూడా ఇవ్వలేదని తూర్పారపట్టారు. జన్మభూమి కమిటీల ద్వారా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అటు మామను, ఇటు ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని.. ఇకపై ఏపీ ప్రజలు ఆయన్ను నమ్మరని పేర్కొన్నారు. పాదయాత్ర సమయంలో తాను ఇచ్చిన హామీల్ని సీఎం అయ్యాక నెరవేరుస్తున్న గొప్ప వ్యక్తి జగనన్న అని కొనియాడారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏమీ చేయలేని చంద్రబాబు.. ఈసారి ఛాన్స్ ఇస్తే చేస్తామంటే, ఎంతవరకు నమ్మాలో మీరు ఆలోచించుకోండని ప్రజల్ని సూచించారు.
తాజావార్తలు
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!