Kottu Satyanarayana: సీఎం జగన్‌ని విమర్శిస్తే.. ప్రజలే పవన్‌కి మరోసారి బుద్ధి చెప్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kottu Satyanarayana Fires on Pawan Kalyan: తన వారాహి యాత్రలో భాగంగా సీఎం జగన్‌పై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్‌గా స్పందించారు. పవన్ కళ్యాణ్ రోజురోజుకి దిగజారిపోతున్నాడని, చంద్రబాబు లాంటి శనిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నాడని మండిపడ్డారు. పిచ్చిపట్టినట్లు.. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబును వదులుకుంటేనే.. పవన్ కళ్యాణ్‌కు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, అది చూసి ఓర్వలేకే జగన్‌పై పవన్ విమర్శలు గుప్పిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా నాయకుడైన జగన్‌ను విమర్శిస్తే.. ప్రజలే పవన్‌కి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. చంద్రబాబు ఐడియాలజీని అమలు చేసే ప్రయత్నం పవన్ చేస్తున్నాడని ఆరోపించారు.
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
రాష్ట్రంలో దేవాలయాలు కూల్చేసింది నీ దత్తతండ్రి చంద్రబాబేనని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. గతంలో దేవాలయాలు కూల్చివేసినప్పుడు కళ్ళు మూసుకున్నావా పవన్? అప్పుడు కోర్టులో ఎందుకు కేసు వేయలేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు హిందూ సంస్కృతి గురించి పవన్‌కు ఏం తెలుసని నిలదీశారు. హిందూ ధర్మంపై మాట్లాడే అర్హత పవన్‌కు లేదని.. వివాహ వ్యవస్థపై గౌరవం లేని పవన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నాడని వ్యాఖ్యానించారు. అన్నవరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోందని, దళారీ వ్యవస్థకు తావు లేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. అన్నవరంలో సరాసరి ఏడాదికి ఏడు లక్షల వ్రతాలు, 4 వేల వివాహాలు జరుగుతాయన్నారు. అన్నవరంలో దళారీ వ్యవస్థ నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నామని, వివాహాలు జరిగే తీరును క్రమబద్ధీకరించామని తెలిపారు. వీటి కోసం ప్రత్యేక అధికారిని నియమించామన్నారు.
Seediri Appalaraju: పవన్‌కు మంత్రి సీదిరి సవాల్.. దమ్ముంటే ఆ పని చేయాలి
ఇదే సమయంలో మంత్రి వేణుగోపాల కృష్ణ కూడా పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. వేషాలు వేసి మోసాలు చేసి, హిందూ ధర్మం కూడా పాటించలేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను తీర్చే సీఎం జగన్ పట్ల అనుచితంగా మాట్లాడటం దారుణమన్నారు. హిందూ ధర్మం గురించి పవన్ మాట్లాడితే.. ఎవరూ వినరని చెప్పుకొచ్చారు. ఒక్కొక్క ప్రాంతంలో కులాలు, ప్రాంతాలు, వాలంటీర్ల గురించి మాట్లాడటం పవన్ నైజమని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చే రెమ్యునరేషన్ మీద పవన్ ఆధారపడ్డాడని ఆరోపించారు.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!