మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కారుమూరిపై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. మేం కనుక నీ భాష ఉపయోగిస్తే.. సాయంత్రానికి నువ్వుండవు గుర్తుపెట్టుకో అని హెచ్చరించారు.. కారుమూరి నిన్ను చిటికిన వేలితో లేపేసే సామర్థ్యం మాకుంది అంటూ హాట్ కామెంట్లు చేశారు..
గెలిచే సత్తా లేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు కూతలు కూస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ 23, జనసేన ఒకటి గెలుచుకున్నారని.. ఈసారి ఒకటి కూడా గెలవలేరని మంత్రి తెలిపారు.