తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా, సభలో స్పీకర్ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. అనంతరం సభను వాయిదా వేశారు. సభ వాయిదా వేసిన తరువాత బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభలో చర్చించే అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. సభలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, తప్పనిసరిగా 20 రోజులు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే, అక్టోబర్ 5 వరకు అసెంబ్లీ…