Kakani Govardhan Reddy: చంద్రబాబును చూసి ప్రజలు ‘ఇదేం ఖర్మ’ అని అనుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: ఏపీలో తెలుగుదేశం పార్టీ తాజాగా వైసీపీ ప్రభుత్వ విధానాలను ఆరోపిస్తూ ‘ఇదేం ఖర్మ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు మాట్లాడిన మాటలు చూసి ప్రజలు విస్తుపోతున్నారని.. చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదని అర్థం అవుతోందని మంత్రి కాకాణి అన్నారు. కర్నూలు పర్యటనపై చంద్రబాబు జబ్బలు చరుచుకుంటున్నారని.. కర్నూలులో న్యాయ రాజధాని విషయంలో ఆయన ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ప్రశ్నిస్తే వారిని వైసీపీ కార్యకర్తలుగా ముద్ర వేస్తున్నారని.. టీడీపీ నేతలకు పచ్చ కండువాలు వేసి అమరావతి పేరుతో పాదయాత్ర చేయిస్తున్నారని చురకలు అంటించారు.
పరిపాలన వికేంద్రీకరణ ఎలా ఉండాలో సీఎం జగన్ చేసి చూపిస్తున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కొనియాడారు. సచివాలయ వ్యవస్థ ఇందుకు నిదర్శనం అన్నారు. రాజధానుల విషయంలో కూడా జగన్ వికేంద్రీకరణను అమలు చేయాలని భావిస్తున్నారని తెలిపారు. వికేంద్రీకరణకు అనుకూలమా.. వ్యతిరేకమా అనే విషయంపై చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు తనపై ఉన్న అవినీతి కేసులపై స్టే తెప్పించుకున్నారని.. సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని జీవో ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు సీబీఐ విచారణ కావాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Also Read
Read Also: Shocking: పిల్లలను కని అమ్మడమే వారి పని.. ఇప్పటికి ఎంతమందో తెలుసా..
చంద్రబాబు చరిత్ర ఎప్పుడో ముగిసిపోయిందని మంత్రి కాకాణి అన్నారు. ఆయన ప్రజల్లో లేరని.. కేవలం పచ్చ మీడియాలో మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ సమావేశంలోనే వైసీపీ పటిష్టంగా ఉందని ఆ పార్టీ సర్వే సిబ్బంది చెప్పారని.. ఇదేం ఖర్మ అని చంద్రబాబును చూసి ప్రజలు అంటున్నారని.. అందుకే ఈ పేరుతోనే ఆయన ప్రజల్లో వెళ్తున్నారని చురకలు అంటించారు. చంద్రబాబుకు అల్జీమర్స్ ఉందని.. దీంతో పాటు ఆయన మానసిక పరిస్థితి కూడా బాగోలేదన్నారు.
తాజావార్తలు
-
PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
-
YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్‌ను పరీక్షించిన పాకిస్తాన్..
-
Nizam Exhibitors: మేం పెద్ది సినిమాని టార్గెట్ చేయలేదు.. పర్సనల్ టార్గెట్ చేశారు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?