బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్. సత్య కుమార్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి పైన నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సత్య కుమార్ అనే వ్యక్తి అసత్య కుమార్ గా మారి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎవరికో రాజకీయంగా లబ్ధి చేకూర్చాలని ప్రయత్నం చేస్తున్నాడన్నారు. బీజేపీ కార్యదర్శిగా కాకుండా, టీడీపీ కార్యదర్శిలా మాట్లాడుతున్నాడు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ నేర్చుకోవాలన్నారు. పథకాల్లో అవినీతి అని సిగ్గులేకుండా సత్యదూరమైన మాటలను సత్యకుమార్ మాట్లాడుతున్నాడన్నారు.
నీ వెనుక ఎవరున్నారు, వారి చరిత్ర ఏమిటో కూడా ప్రజలకు తెలుసన్నారు. అసలు ఈ రాష్ట్రంలో నిన్ను ఎవరైనా గుర్తుపడతారా?? సత్య కుమార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. మరొకసారి వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే మాటలు మాట్లాడితే సత్యకుమార్ కి తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు మంత్రి జోగి రమేష్.
Read Also: Pakistan: బలూచిస్తాన్‌లో భారీ పేలుడు.. ఒకరి మృతి, 10 మంది పరిస్థితి విషమం
ముఖ్యమంత్రి తనను మందలించారనేది రాజకీయ ప్రచారం మాత్రమే అన్నారు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్. గడపగడపకు కార్యక్రమంలో నేను వెనుకబడలేదు….టైపింగ్ ఎర్రర్ మూలంగా చోటు చేసుకున్న స్వల్ప కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే….30రోజులు అని ఉండాల్సిన చోట 13రోజులుగా నమోదైంది. ఆసమావేశంలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళానన్నారు. వెంటనే తప్పును సరిదిద్దమని సూచించారు. మా మీద ప్రేమతో మరింత కష్టపడి పని చెయ్యమని అధినాయకుడు చెబితే దానిని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు అదీప్ రాజ్.
Read Also: PM Convoy: కాన్వాయ్ ఆపి.. అంబులెన్స్‌కు దారిచ్చిన ప్రధాని మోదీ