Minister Buggana Rajendranath Reddy: అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అమరావతి విషయంలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం సాగుతోంది. రాజధానికి సంబంధించి శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు పూర్తిగా పక్కపెట్టేశారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. అక్కడ టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కొందరి చేతుల్లోనే అమరావతి భూములు ఉన్నాయని బుగ్గన అన్నారు. పరిటాల, పయ్యావుల, ధూళిపాళ్ల, హెరిటేజ్ ఫుడ్స్.. సహా చాలా మంది టీడీపీ నేతలు భూములు సేకరించారని తెలిపారు. రాజధాని ప్రకటనకు ముందే ఇదంతా జరిగిందన్నారు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురి దుర్మరణం
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
హెరిటేజ్ ఫుడ్స్ కూడా 14 ఎకరాల భూమిని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. అమరావతిలో కొందరు మాత్రమే భూములు ఎలా కొన్నారని బుగ్గన ప్రశ్నించారు. రాజధాని ప్రకటన ఎప్పుడు జరిగిందని బుగ్గన టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ని ప్రశ్నించారు. అమరావతిలోవి తాత్కాలిక నిర్మాణాలు.. వేల ఎకరాల భూములు కొంతమంది చేతుల్లోనే ఉన్నాయన్నారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ అని, అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. దళితులను భయపెట్టి అసైన్డ్ భూములను లాక్కున్నారని మండిపడ్డారు.
కొందరి ఆస్తి విలువ పేంచేందుకు రాష్ట్ర మొత్తం పన్ను కట్టాలా? అని నిలదీశారు. అమరావతిలోఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి బుగ్గన అన్నారు. బిల్డింగులు కడితే పరిపాలన సాగుతుందా అని ప్రశ్నించారు. రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో భూముల కొనుగోలు జరిగిందన్నారు. రియల్ ఎస్టేట్ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. పాదయాత్రలో స్థానికులు లేరని, రియల్ ఎస్టేట్ బ్యాచ్ చేస్తున్న పాదయాత్ర ఇదని ధ్వజమెత్తారు.
అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేదే సీఎం జగన్ ఆకాంక్ష అని తెలిపారు.అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందనే భావనతోనే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనుగోలు చేశారన్నారు మంత్రి బుగ్గన. కొంతమంది వ్యక్తులు మాత్రమే భూములు కొనడం ఏంటి? అమరావతి విషయంలో జరిగింది అందరికీ తెలుసన్నారు ఆర్థికమంత్రి బుగ్గన. తొలుత రాజధాని నాగార్జున వర్శిటీ అన్నారు.. తర్వాత నూజివీడు అన్నారు..అక్కడ జనం భూములు కొనుక్కుంటే.. ఈ టైంలో అమరావతిలో భూములు కొనుక్కున్నారు. రాజధాని ప్రాంతంలో భూములు ఎవరు కొనుగోలు చేశారో వివరించిన బుగ్గన. పెదకాకాని, కంతేరు, తాడికొండ.. లలో హెరిటేజ్ ఫుడ్స్, పయ్యావుల హారిక కొనుగోలు చేసిన భూములు వివరించారు మంత్రి బుగ్గన.
Read Also: Kodali Nani Speech in Assembly On 3 Capitals : అసెంబ్లీలో కొడాలి నాని పవర్ ఫుల్ స్పీచ్
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!