Botsa Satyanarayana: ఫేస్ రికగ్నిషన్ యాప్ విషయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు విఫలం అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్స్ విషయంలో ఉపాధ్యాయులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందని.. నిమిషం ఆలస్యం అయితే ఆబ్సెంట్ వేస్తారన్నది వాస్తవం కాదన్నారు. మూడు సార్లు ఆలస్యంగా వస్తే నాలుగోసారి హాఫ్ డే కింద పరిగణించటం…