వైసీపీకి బిగ్ షాక్ తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది.. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారట ఆ పార్టీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ.. దీనిపై రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
Off The Record about Mopidevi Venkata Ramana: మోపిదేవి వెంకటరమణ. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడు. 2019 ఎన్నికల్లో రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మోపిదేవిని సీఎం జగన్ ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇచ్చారు. శాసనమండలిని రద్దు చేయాలనే జగన్ ఆలోచనలతో ఎమ్మెల్సీ, మంత్రి పదవి పోయాయి. అయినా రాజ్యసభకు ఎంపీగా పంపారు. వరుసగా దెబ్బతిన్నా ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ రేపల్లెలో వైసీపీ జెండా…
ప్రకాశం జిల్లా పర్యటనలో మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని, వైఎస్ఆర్ కుటుంబాన్ని వేర్వేరుగా చూడలేమని తెలిపారు. విజయమ్మ గౌరవ అధ్యక్షురాలి పదవికి ఎందుకు రాజీనామా చేస్తున్నారో వివరించారని.. అయినా ఈ విషయంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వైఎస్ఆర్‌సీపీ అనేది జగన్ కష్టంతో ఎదిగిన పార్టీ అని అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్లీనరీకి వచ్చిన జనాన్ని చూసి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిందని.. దీంతో పిచ్చిపిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని ఒక వర్గానికి ధారాదత్తం చేశారని ఆరోపించారు.…