ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరనాథ్‌లో యాత్ర తీవ్ర విషాదం నింపుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఆకస్మికంగా ముంచెత్తిన వరదలతో భారీగా ప్రాణనష్టం కలిగింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకు అందిన తాజా సమాచారం ప్రకారం అమర్‌నాథ్ యాత్రలో తలెత్తిన ఈ ప్రకృతి విపత్తుకు 15 మంది యాత్రికులు మృతి చెందినట్లు ఏపి ప్రభుత్వ ఉన్నతాధికారి హిమాంశ్ కౌశిక్ వెల్లడించారు. ఇప్పటివరకు అధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం, జల విలయంలో మొత్తం 15 మంది యాత్రికులు మృతి చెందారని.. 37 మంది ఆచూకీ గల్లంతు అయినట్లు ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారి హిమాంశ్ కౌశిక్ ప్రకటించారు. ఆచూకి గల్లంతైన యాత్రికుల సంఖ్య ఈ రోజు సాయంత్రం వరకు మరింతగా తగ్గే అవకాశం ఉందని అధికారుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Amarnath Yatra: అమర్ నాథ్‌లో సహాయకచర్యలు.. ఏపీ వాసులు సేఫ్
ఆచూకీ గల్లంతైన వారిలో 16 మంది తెలుగు యాత్రికులు ఉన్నారని.. వీరిలో ఇప్పటివరకు 14 మంది క్షేమంగా ఉన్నారని… కేవలం ఇద్దరు తెలుగు యాత్రికులు ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాజమండ్రికి చెందిన గునిశెట్టి సుధ, కొత్త పార్వతి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. శ్రీనగర్ నుంచి స్వయంగా ఏపీ ఐఏఎస్ ఉన్నతాధికారి హిమాంశ్ కౌశిక్ పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ రావాలనుకునే తెలుగు యాత్రికులు, బంధువులు ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన ‘హెల్ప్ లైన్’ నెంబర్ల ద్వారా సంప్రదించాలని ఆయన వెల్లడించారు. తెలుగు యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు.