Adimulapu Suresh: ఏపీలో ఆగస్టు 15 తర్వాత ఊహించని పరిణామాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మూడు రాజధానుల విషయంపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఏదైనా అనుకుంటే చేసి తీరుతుందని.. మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలుకు జ్యుడిషయల్ క్యాపిటల్ వచ్చేసిందని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. కానీ తాను ఈ విషయాన్ని చెప్పకనే చెప్తున్నానని.. అఫీషియల్‌గా అప్పుడే చెప్పకూడదని క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 తర్వాత ఏపీలో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయని.. ఏం జరగబోతుందో మీరే చేస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
Read Also:
Also Read
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
- CM Chandrababu: గ్రూప్-1 నియామకాల్లో భయంకరమైన అక్రమాలు.. గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు విమర్శలు
- YS Jagan: ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం.. మరో ఏడాదిలో పాదయాత్ర..
- Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!
కర్నూలుకు పెద్ద కంపెనీలు, సెజ్ రాబోతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఏపీలో టౌన్ ప్లానింగ్‌లో అవినీతి ఉందని.. విజిలెన్స్, ఏసీబీ కేసుల ఫైల్స్ చూస్తే 150 కేసుల వరకు ఇవే పెండింగ్ ఉన్నాయని తెలిపారు. టౌన్ ప్లానింగ్ తీరు మారాల్సిన అవసరం ఉందన్నారు. సిటీ ప్లానర్ ఈ విషయంలో బాధ్యత వహించాలన్నారు. కిందిస్థాయి సిబ్బందిపై నెపం వేస్తే కుదరదని మంత్రి ఆదిమూలపు సురేష్ హితవు పలికారు. ఏపీలో సుమారు 16వేల అక్రమ లేఅవుట్లు ఉన్నాయన్నారు. అటు ఏపీకి నిధుల సమస్య లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 95 శాతం నెరవేర్చామని.. గత ప్రభుత్వం గ్రాఫిక్స్ చేసిందని.. అమరావతి చుట్టూ అభివృద్ధి అంటూ ఇన్‌సైడర్ ట్రెడింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు. ఓ సామాజిక వర్గానికే అభివృద్ధి జరిగేలా చేశారన్నారు. అందుకే వికేంద్రీకరణ మంత్రంతో అభివృద్ధి, పాలన అన్ని ప్రాంతాలకు అందేలా సమన్యాయం చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కాగా మంత్రి సురేష్ వ్యాఖ్యలతో త్వరలోనే కర్నూలులో ఏపీ హైకోర్టు ఏర్పాటవుతుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
-
Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
-
Door Lock Care Tips: వానలకు మీ ఇంటి తాళాలు పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మెరిపించండి!
-
Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!