ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు ఎల్లుండి నిర్వహించనున్నారు.. అయితే, ముందుగా ప్రకటించినట్టుగా ఆయన స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో కాకుండా.. మరోచోట అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఎల్లుండి నిర్వహించనున్నారు.. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్ద గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి.. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే గౌతమ్‌రెడ్డి భౌతిక కాయం ఉండగా.. రేపు ఉదయం నెల్లూరుకు తరలించనున్నారు..…
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని రేపు ఆర్మీ హెలికాప్టర్‌లో నెల్లూరుకు తరలించనున్నారు.. ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. గుండెపోటుకు గురైన ఆయన హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.. అయితే, ఆయన్ను ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.. గౌతమ్‌రెడ్డి ఇంటి వద్దే కుప్పకూలారని వైద్యులు ప్రకటించారు. ఉదయం 7.45 గంటలకు గౌతమ్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకువచ్చారని.. ఆస్పత్రికి వచ్చేసరికే స్పందించని స్థితిలో ఉన్నారని తెలిపారు.. అయితే, రేపు ఉదయం ఆర్మీ…
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠన్మారణంతో ఏపీ విషాదంలో మునిగిపోయింది.. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణులు దిగ్భ్రాంతికి లోనవుతున్నాయి… సీఎం వైఎస్ జగన్ సహా.. మంత్రులు, నేతలు.. హైదరాబాద్‌కు వచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.. మేకపాటి భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. సొంత అన్నను కోల్పోయినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎక్కడ కూడా వివాదాలు లేని వ్యక్తి మేకపాటి గౌతమ్‌రెడ్డి అని పేర్కొన్న ఆయన.. ఎప్పుడూ నవ్వే వ్యక్తి ఆయన అని గుర్తుచేసుకున్నారు..…