Atrocious: ఇంగ్లీష్ లో ఓ సామెత ఉంది. పేరెంట్స్ ఆర్ ఫస్ట్ టీచర్స్, టీచర్స్ అర్ సెకండ్ పేరెంట్స్ అని.. అంటే.. తల్లిదండ్రులు మొదటి గురువులు, గురువులు తల్లిదండ్రుల తరువాత తల్లిదండ్రులు అంతటి వారు అని. అయితే ప్రస్తుతం కొందరు ఉపాధ్యులు ఇంకితజ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. మనుషులం అనే విషయాన్ని మర్చిపోయి మృగాలుగా మారుతున్నారు. విద్యార్థినీల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కారణం ఓ లెక్చరర్ విద్యార్థిని బెదిరించి అత్యాచారానికి పాల్పాడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
Read also:Snake Carcass in Nutritional Food: వామ్మో..! పౌష్టికాహారంలో పాము కళేబరం.. ఇది చైనా కాదురా అయ్యా..
వివరాలలోకి వెళ్తే.. మార్కాపురం పూల సుబ్బయ్య కాలనీకి చెందిన మైనర్ బాలిక మార్కాపురం లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతుంది. అదే కళాశాలలో యర్రగొండపాలెం మండలం పాలుట్లకు చెందిన గోవింద్ నాయక్ ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విద్యార్థిని ఇంటి వద్ద దించుతాను బైక్ ఎక్కమని అడిగాడు. లెక్చరరే కదా అని ఆ బాలిక అతని బైక్ ఎక్కి వెళ్ళింది. అలా అతను విద్యార్థినిని బైక్ పైన తీసుకు వెళ్తూ ఆమె అసభ్యకర చిత్రాలను ఫోన్ లో చిత్రీకరించాడు. అనంతరం ఆ చిత్రాలను చూపించి ఆ విద్యార్థిని ని బెదిరించి అత్యాచారం అత్యాచారం చేయగా.. విద్యార్థిని గర్భం దాల్చింది. దీనితో బాలిక తన తల్లిదండ్రులకి జరిగిన విషయం చెప్పగా ఈ వార్త వెలుగు చూసింది.