రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారు ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారి (563)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. వరంగల్ నుంచి తొర్రూరు వైపుకు వెళ్తున్న బస్సుని వరంగల్ వైపు వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25మందికీ ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్ లో సుమారు 44 మంది ప్రయాణికులు వున్నట్టు ప్రాథమిక సమాచారం. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని…
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం, ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు గిరిజన విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. Also Read:Upasana : ఉపాసనకు కీలక బాధ్యతలు ఇచ్చిన సీఎం రేవంత్.. సమాచారం…
ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్…
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగి ముగ్గురు సంజీవ దహనమయ్యారు. ఖమ్మం – వరంగల్ మధ్య జాతీయ రహదారిపై రెండు లారీలు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా క్యాబిన్‌లో మంటలు చేలరేగి ఇద్దరు డ్రైవర్లు ఒక క్లీనర్ సజీవ దహనం అయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:One Big Beautiful Bill: ట్రంప్ కు భారీ…
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం దొమ్మన్న బావి వద్ద టెంపో ట్రావెల్ ను లారీ ఢీకొట్టింది. తిరుమల నుంచి కర్ణాటక బాగేపల్లి వెళ్తున్న టెంపో ట్రావెల్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వారు చరణ్, మేఘర్ష్, శ్రావణి గా గుర్తించారు. డ్రైవర్ మంజునాథ్ తో సహా మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని మదనపల్లె…
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొమరోలు మండలం తాటిచర్ల మోటు వద్ద కారు లారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు బాపట్ల మండలం స్టువర్టుపురం వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహానందికి వెళ్ళి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.…
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుని హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్ కి తరలించారు. Also Read:US: విదేశాలకు పంపే డబ్బుపై పన్ను.. ట్రంప్ ప్రభుత్వం సన్నాహాలు..…
మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. నో ఎంట్రీ రోడ్లోకి అత్యంత వేగంగా దూసుకొచ్చిన లారీ.. రోడ్డు మధ్యలో ఉన్న ట్రాఫిక్ అంబరిల్లాను ఢీకొన్నది. ఈ సమయంలో అక్కడే ఉన్న ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ హోంగార్డ్ సింహాచలం మృతి చెందాడు. పోలీస్ కానిస్టేబుల్ రాజవర్ధన్, వికేందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యా్ప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.…
విశాఖలోని ఆర్కే బీచ్లో ఓ ఇసుక లారీ భీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం 6:30 గంటల సమయంలో నోవాటల్ పక్కన ఎత్తుగా ఉన్న రోడ్డు నుండి బీచ్ రోడ్డులోకి ఇసుక లోడ్ తో వస్తున్న లారీ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. దీంతో ఎదురుగా ఉన్న డివైడర్ను ఢీకొని చిల్డ్రన్ పార్కులోకి లారీ దూసుకు పోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్తో పాటు బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తున్న మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన…