Fire Accident: ప్రకాశం జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొమరోలు మండలం దద్దవాడ శివారులో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలు చెలరేగి లారీకి మొత్తం మంటలు వ్యాపించాయి. క్రమంగా అవి లారీ మొత్తానికి వ్యాపించడంతో అందులో ఉన్న 306 సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలిపోయాయి. దీంతో భయంతో డ్రైవర్, క్లీనర్ లారీ నుంచి దిగి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. ఒక్కొక్కటిగా భారీ శబ్దాలతో సిలిండర్లు పేలడంతో సమీపంలోని…