PM Modi: దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఆంధ్రప్రదేశ్‌కి ఉంది.. ఎన్‌డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారుతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కర్నూలు శివారులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో అనంతమైన అవకాశాలు ఉన్నాయి.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో విజనరీ నాయకత్వం ఏపీలో ఉందన్నానరు.. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్తోందన్న ఆయన.. ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుందని.. ప్రాజెక్టులతో పరిశ్రమలకు ఊతంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగవుతాయని వెల్లడించారు..
Read Also: Anasuya : ఆ హీరో అంటే పిచ్చి.. ఛాన్స్ వస్తే పెళ్లి చేసుకునేదాన్ని
ఏ దేశమైనా.. రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులతో దేశం ఇంధన సామర్థ్యం పెరుగుతుందన్న ఆయన… గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా సబ్ సీ గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్ మారుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఈ ప్రాజెక్టు విశాఖను ఏఐ, కనెక్టివిటీ హబ్‌గా మారుస్తుందని.. తద్వారా భారత్‌తో పాటు యావత్ ప్రపంచానికి సేవలు అందుతాయన్నారు.. భారత్ అభివృద్ధికి ఆంప్రదేశ్ అభివృద్ధి చాలా అవసరం.. అలాగే ఏపీ అభివృద్ధికి.. రాయలసీమ అభివృద్ధి అంతే అవసరం అన్నారు భారత ప్రధాని.. అయితే, ఈ ప్రాజెక్టులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి.. రాయలసీమ ప్రగతికి సరికొత్త ద్వారాలు తెరుస్తాయని వెల్లడించారు.. ఇక, ఏపీ పర్యటనలో కర్నూలు శివారులో ఏర్పాటు చేసిన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ భారీ బహిరంగ సభ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..