Anasuya : యాంకర్ అనసూయ అప్పుడప్పుడు చేసే కామెంట్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. ఆమె ఎలాంటి కామెంట్లు అయినా ఓపెన్ గానే చేసేస్తుంది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. ఇప్పుడు నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. వస్తున్న అవకాశాలను గట్టిగానే వాడుకుంటోంది. అయితే రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేసింది. నేను పెళ్లికి ముందు ఒకే ఒక్క బాయ్ ఫ్రెండ్ ను మెయింటేన్ చేశా. అతన్నే పెళ్లి చేసుకున్నా. నేను నమ్మిన వాళ్లను అస్సలు విడిచిపెట్టలేను. వాళ్ల కోసం ఎంత దూరం అయినా వెళ్లాలి అనిపిస్తుంది. అందుకే భరద్వాజ్ కోసం ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి మరీ పెళ్లి చేసుకున్నానని తెలిపింది అనసూయ.
Read Also : Chiranjeevi : క్రికెటర్ తిలక్ వర్మకు మెగాస్టార్ సన్మానం..
ఇక హీరోల్లో ఎవరు ఇష్టం అని అడగ్గా.. వెంటనే రామ్ చరణ్ పేరు చెప్పేసింది. రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. అతనంటే ఒక రకంగా పిచ్చి. ఎందుకంటే చరణ్ కు లేడీస్ అంటే చాలా గౌరవం. అంత పెద్ద మెగాస్టార్ కొడుకు అయినా సరే కొంచెం కూడా గర్వం ఉండదు. అందరితో సరదాగా నవ్వుతూ ఉంటాడు. ఒకవేళ నాకు బాయ్ ఫ్రెండ్ గా భరద్వాజ్ లేకపోతే రామ్ చరణ్ తో డేటింగ్ చేయడానికైనా రెడీగా ఉండేదాన్నేమో అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. దీంతో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనసూయ తరచూ ఇలాంటి బోల్డ్ కామెంట్లు చేస్తూనే ఉంటుంది.
Read Also : Brahmanandam : ఆయన వల్ల స్టేజిపైనే ఏడ్చేసిన బ్రహ్మానందం.. ఎందుకంటే..?