PM Modi: ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి.. ఏపీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో విజనరీ నాయకత్వం ఉంది.. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్తోంది అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అహోబిలం నరసింహస్వామి, మహానందీశ్వరుడికి నమస్కరిస్తున్నా.. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నా.. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన గుజరాత్‌లో నేను జన్మించాను.. విశ్వనాథుడి భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం లభించింది.. ఇవాళ శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆశీస్సులు పొందాను.. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోదైన శ్రీశైలం మల్లిఖార్జునుడిని దర్శించుకున్నాను.. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించాను అని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోడీ..
Read Also: Gujarat: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. సీఎం తప్ప మంత్రులందరు రాజీనామా..
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, హరిసర్వోత్తమరావుకి శ్రద్ధాంజలి అని పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఏపీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో విజనరీ నాయకత్వం ఉంది. ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్తోందన్నారు.. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం.. ఈ 21 శతాబ్ధం భారత్‌దే అని స్పష్టం చేశారు.. రోడ్లు, రైల్వేలతో సహా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు ఉండేవి.. కనీసం కొన్ని గ్రామాల్లో కరెంట్ పోల్స్ కూడా ఉండేవి కావన్న ఆయన.. ఇప్పుడు దేశంలో కరెంట్ లేని గ్రామం లేదన్నారు..
శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు గ్యాస్ పైప్‌లైన్.. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు కనెక్టివిటీపై ఫోకస్ పెట్టాం అన్నారు ప్రధాని మోడీ… 2047 వికసిత్ భారత్ సంకల్పానికి స్వర్ణాంధ్ర ఎంతో సహకరిస్తోంది.. రెండ్రోజుల క్రితం ఏపీలో గూగుల్ పెట్టుబడి ప్రకటించింది.. గూగుల్ ఏఐ హబ్‌తో విశాఖ అంతర్జాతీయ కేబుల్ హబ్‌గా మారబోతోంది.. దేశాభివృద్ధికి ఏపీ అభివృద్ధి అవసరం.. అలాగే ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అవసరం అన్నారు.. నిమ్మలూరు నైట్ విజన్ పరికరాల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఫ్యాక్టరీ రక్షణరంగంలో కీలకపాత్ర పోషించబోతోంది.. కర్నూల్‌ను డ్రోన్ హబ్‌గా మార్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం అని తెలిపారు.. ఆపరేషన్ సిందూర్‌లో మన డ్రోన్లు అద్భుతాలు సృష్టించాయన్నారు.. దేశంలో రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను లేకుండా చేశాం.. జీఎస్టీ భారం తగ్గించాం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ..