MLA Virupakshi: ర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అత్యుత్సాహం ప్రదర్శించాడు. చిప్పగిరిలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణంలో ఏకంగా సీతమ్మ వారికి ఎమ్మెల్యేనే స్వయంగా తాళి కట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే, సీతమ్మ వారి మంగళసూత్రం తాకి ఇవ్వమని, ఎమ్మెల్యే విరూపాక్షికి పండితులు తాళిని అందజేశారు. కానీ, ఆ తాళిని కళ్ళకు అద్దుకోవాల్సింది పొగా.. సీతమ్మ దేవి మెడలో ఆ మంగళసూత్రాన్ని కట్టేశారు ఎమ్మెల్యే విరూపాక్షి.
Read Also: Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి షాక్.. నోటీసులిచ్చిన సూళ్లూరుపేట పోలీసులు
అయితే, సీతమ్మకి తాళి కడుతున్న ఎమ్మెల్యే విరూపాక్షిని అడ్డుకోకుండా అక్కడే ఉన్న పండితులు అక్షింతలు కూడా వేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఎమ్మెల్యేపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇక, ఈ ఘటనపై ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి క్షమాపణలు కూడా చెప్పారు. పండితులు కట్టమంటేనే.. నేను సీతమ్మ మెడలో తాళిబొట్టు కట్టినట్లు తెలిపాడు. దేవుళ్ళ పైన తనకు ఎంతో భక్తి అలాగే విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు. గత 15 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేస్తున్నానని కూడా ఎమ్మెల్యే విరూపాక్షి క్లారిటీ ఇచ్చారు.