ఏపీలో సంచలనం కలిగించిన కానిస్టేబుల్ సురేంద్ర హత్యకేసుపై కర్నూలు డీఐజీ సెంథిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో కానిస్టేబుల్ సురేంద్రను దారుణంగా హత్య చేశారు. మద్యం సేవిస్తున్నవారిని మందలించినందుకు కానిస్టేబుల్ సురేంద్రపై దాడి చేశారన్నారు. ఆటోను నిలిపి అందులో వేసి 9 మంది కత్తులతో పొడిచి హత్య చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలించామని డీఐజీ తెలిపారు. కర్నూలు టెడ్
నిందితులు. వెంకటసాయి అలియాస్ కవగాడు, సుబాన్ బాషా, మాలిక్ బాషా, బండి మహేంద్ర, దైవం.దీన్నే మౌళి కిషోర్, మహబూబ్ బాషా, గోసుల విజయ్, ఎడవలి కళ్యాణ్ లను గుర్తించామన్నారు.
Read Also: The Ghost: నాగ్ బిగి కౌగిలిలో బాలయ్య హీరోయిన్..
నిందితులు హత్య తరువాత హైద్రాబాద్ పారిపోయారు…అక్కడ ఎవరు షెల్టర్ ఇచ్చారో విచారిస్తున్నాము. కానిస్టేబుల్ సురేంద్ర నిజాయితీ కలిగిన ఉద్యోగి. క్రిమినల్ సమాచారం ఇవ్వడంలో సమర్థుడు. పోలీస్ శాఖ తరుపున చట్టప్రకారం సహాయం అందుతుంది.. అతని కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుంది. సురేంద్ర హత్య కేసు ఫాస్ట్ ట్రాక్ లో విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తాం అన్నారు. నిందితుల్లో నలుగురు రౌడీ షీటర్లు వున్నారన్నారు. కానిస్టేబుల్ సురేంద్ర రౌడీలపై నిఘా ఉంచారని కక్ష ఉంది. ఆ కక్షతోనే దారుణంగా హత్య చేశారని డీఐజీ సెంథిల్ కుమార్ వివరాలు తెలిపారు.
Read Also: Amit Shah Munugode SamaraBheri Live Updates: మునుగోడులో అమిత్ షా సమరభేరి లైవ్ అప్ డేట్స్