రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలని ఏపీకి కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఇరిగేషన్ సెక్రటరీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. అందులో డీపీఆర్ సమర్పించి, ఆమోదం పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దని ఏపీకి స్పష్టం చేసిన కృష్ణా బోర్డు… రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలంటూ ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలనూ లేఖలో ప్రస్తావించింది కేఆర్ఎంబీ. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందన్న అంశాన్ని లేఖలో పేర్కొన్న కేఆర్ఎంబీ… ప్రాజెక్టు సైటులో నిపుణుల బృందం పర్యటనకు ఏపీ సహకరించడం లేదని కేఆర్ఎంబీ ఆక్షేపణ చేసింది.నిపుణుల బృందంలోని కొందరి సభ్యుల విశ్వసనీయతపై గతంలోనే అనుమానాలు వ్యక్తం చేసిన ఏపీ… తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారని కొందరు సభ్యులని తప్పించాలని గతంలోనే సూచించింది. ఏపీ అభ్యర్ధనపై ఇప్పటి వరకు స్పందించని కేఆర్ఎంబీ… లేఖతో పాటు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులో జరుగుతోన్న పనుల ఫొటోలని జత చేసింది కేఆర్ఎంబీ.