Perni Nani: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. ఓ కేసు విషయంలో మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019లో టీడీపీ కార్యకర్త చందు, శ్రీహర్షలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసులో సాక్షిగా పేర్నినాని ఉన్నారు.
మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు మచిలీపట్నం కోర్టులో ఊరట దక్కింది.. అయితే, ఇదే సమయంలో.. విచారణకు సహకరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కోర్టు.. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్య జయసుధ మచిలీపట్నం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. గత వారం విచారణ ముగించిన జిల్లా కోర్టు.. విచారణను వాయిదా వేసిన విషయం విదితమే.. అయితే, బియ్యం మాయం కేసులో ఏ1గా ఉన్న…