Kodali Nani: గత కొన్నిరోజులుగా ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే బూతు పదాలతో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఫేక్ అని పోలీసులు చెప్పినా టీడీపీ రాద్ధాంతం చేయడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. లింగ పరిశోధనలో నిష్ణాతులైన టీడీపీ వాళ్లు.. రాష్ట్రంలో ఏది ఎవరిదో కూడా తేల్చి ఐడీ కార్డులు ముద్రిస్తారా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని మాధవ్ చెప్తున్నా.. అది మాధవ్‌దే అని టీడీపీ వాళ్లు, ఎల్లో మీడియా అంటోందని.. మాధవ్‌ది పట్టుకుని ఎందుకు వేలాడతారని కొడాలి నాని ప్రశ్నించారు. మాధవ్‌ది పట్టుకుని వేలాడినా వైసీపీని, జగన్‌ను ఇంచు కూడా కదల్చలేరన్నారు.
అటు ఫేక్ వీడియో తయారుచేసి దానిని అప్‌లోడ్ చేసే ధైర్యం కూడా చంద్రబాబు, లోకేష్‌కు లేదని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. శాడిస్టుల మాదిరి సిగ్గు శరం లేకుండా కేసులు పెట్టాలంటున్న … టీడీపీ ఎవరిపై పెట్టాలో కూడా చెప్పాలని కొడాలి నాని ధ్వజమెత్తారు. తెలుగు మహిళలు, తెలుగు యువత, తెలుగు వృద్ధులంతా కలిసొచ్చిన వైసీపీని ఏం చేయలేరని కొడాలి నాని స్పష్టం చేశారు. వీడియోలో కనిపిస్తోంది టీడీపీ నేతల శరీరాలు అని.. వాటికి మొహం మాత్రం వైసీపీ నేతలది పెడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. వీడియోలో ఉన్నది తాను కాదని మాధవ్ చెప్తున్నా సిగ్గులేని టీడీపీ నేతలు ఇంకా వాదిస్తున్నారని.. వీడియోలో ఉన్నది.. మాధవ్ కి ఉన్నది ఒకటేనా కాదా అని డిబేట్లు పెడుతున్నారని చురకలు అంటించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఏది ఎవడిదో అన్న విషయంపైనే టీడీపీ నేతలు దృష్టి పెట్టడం సిగ్గుచేటు అని కొడాలి నాని విమర్శలు చేశారు.