Kishan Reddy In Global Investors Summit 2023: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకూ దిగజారుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతోందని, కుటుంబ పార్టీల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఒక్క బీజేపీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏపీ ఎక్కువగా అభివృద్ధి చెందిందన్నారు. అయితే.. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు, బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పర్యాటక అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని రాజధానిలో నిర్వహించే సభకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారన్నారు. ఇదే సమయంలో కిషన్ రెడ్డి నోటి వెంట ఏపీ రాజధాని ప్రస్తావన కూడా వచ్చింది. విశాఖపట్టణం రాజధాని ప్రాంతం అని, జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీగా మాధవ్‌ని ఆశీర్వదించి మళ్లీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాధవ్ వంటి వారుంటే.. ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు.
Minister Roja: జగన్ అంటే ఒక బ్రాండ్.. జగన్ అంటే జోష్
ఇదిలావుండగా.. విశాఖలో మొదటి రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ సాగిస్తున్న పయనంలో ఏపీ కీలకమని, 975 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఈ రాష్ట్రం భారత గ్రోత్ స్టోరీలో భాగస్వామ్యం అవుతుందని అన్నారు. దేశ లాజిస్టిక్ రంగంలో కీలక భాగస్వామ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పోర్టులన్నింటిని నాలుగు లేన్ల జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని.. రాష్ట్రం నుంచి వెళ్లేలా 5 గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులను నిర్మిస్తున్నామని.. దీనికోసం రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అందులో భాగంగానే 4200 కిలోమీటర్లున్న జాతీయ రహదారులను 8700 కిలోమీటర్లకు పెంచామని వెల్లడించారు.
Husband Kidnap: దారుణం.. RIP అంటూ భర్త ప్రచారం.. శిరోముండనం చేసిన భార్య ప్రియుడు