తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఢిల్లీ పర్యటనలో ఊహించని షాక్ తగిలింది.. చంద్రబాబుపై సొంత పార్టీ ఎంపీ కేశినేని నాని అసహనం వ్యక్తం చేయడం చర్చగా మారింది.. దీంతో, చంద్రబాబుకే నాని సెగ తాకినట్టు అయ్యింది… ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుపై నేరుగా అసహనం ప్రదర్శించారు కేశినేని నాని.. చంద్రబాబుకు పుష్ఫ గుచ్ఛం ఇచ్చేందుకు నిరాకరించారు.. బొకే ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ ఓవైపు కేశినేని నానిని ఆహ్వానిస్తుంటే.. ఏమాత్రం పట్టించుకోని ఎంపీ కేశినేని నాని.. ఆ బొకేను విసుగుతో గట్టిగా తోశారు.. అయితే, ఫొటోకు మాత్రం బాగనే పోజులిచ్చారు.. అంతేకాదు.. చంద్రబాబు విమానాశ్రయం నుంచి బయటకు రాగానే.. టీడీపీ ఎంపీలు అంతా స్వాగతం పలికారు.. చంద్రబాబుకు నాని నమస్కారం చేస్తే.. అదే సమయంలో చంద్రబాబు అటు తిరిగారు.. ఆ తర్వాత కాస్త దూర దూరంగానే ఆయన కనిపించారు.. అందరి ముందు కేశినేని వైఖరితో చంద్రబాబు నిర్ఘాంతపోయారు.
Read Also: Lightning Strike: వైట్‌హౌస్ సమీపంలో పిడుగు.. ముగ్గురు మృతి, అగ్నిప్రమాదంలో మరో 10 మంది
కాగా, ఇటీవల బెజవాడ రాజకీయాల్లో కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది.. ఒకరు తన పేరును, హోదాను వాడుకుంటున్నారని ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరిట వీఐపీ వాహన స్టిక్కర్ నకిలీది వాడుతూ విజయవాడ, హైదరాబాద్‌లో తిరగుతున్నారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరారు.. అయన ఎవరో కాదు.. కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని.. ఈ వ్యవహారంతో సోదరుల మధ్య విభేదాలు బయటపడ్డాయి.. తన తమ్ముడు శివనాథ్‌తో రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయన్న భావనలో కేశినేని నాని ఇలా వ్యవహరించారనే చర్చ సాగింది.. విజయవాడ ఎంపీగా నాని టీడీపీ నుంచి రెండుసార్లు విజయం సాధించారు కేశినేని నాని.. ఆయన విజయంలో తెరవెనుక ఆయన సోదరుడు శివనాథ్ పాత్ర కీలకమైనదే.. కానీ, ఇప్పుడు విజయవాడ ఎంపీ సీటుకి ప్రత్యామ్నాయ అభ్యర్థిగా చిన్ని ఎదగాలనుకుంటున్నారని.. అతడికే సీటు ఇస్తారే అనుమానాలు కూడా ఆయనలో ఉన్నాయట.. కొంత కాలంగా పార్టీ అధినేతకు దూరంగా ఉంటున్న కేశినేని నాని.. పార్టీ తీరుపై కూడా అసంతృప్తితో ఉన్నారు.. ఇక, ఢిల్లీ వేదికగా ఆయన నిరసన తెలియజేసినట్టు చర్చ సాగుతోంది.