సామర్లకోట మున్సిపాలిటీలో సొంత పార్టీ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధం అయ్యారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు.. మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి అనుమతి కోరుతూ కలెక్టర్ కి లేఖ రాశారు 22 మంది వైసీపీ కౌన్సిలర్లు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీల తర్వాత అధికార యంత్రాంగం కదిలింది. కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను అధికార యంత్రాంగం సీజ్ చేసింది. ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీని జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఏర్పాటు చేశారు.
కాకినాడ కలెక్టర్ షన్మోహన్ కంట తడి పెట్టుకున్నారు. బాలల హక్కుల వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలపై మాట్లాడుతూ కలెక్టర్ షన్మోహన్ ఎమోషనల్ అయ్యారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడం వల్లే కలెక్టర్ అయ్యానని భావోద్వేగానికి గురయ్యారు.
ఏలేరు వరద ఉధృతి ఆందోళన కలిగిస్తోంది.. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం.. అన్ని రకాలుగా సన్నద్ధమైన విషయం విదితమే.. కాగా, ఏలేరు వరద ఉధృతిపై కాకినాడ కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ తో పాటు ఆర్మీ బృందాల సేవలను కూడా వినియోగించుకొని ముంపు ప్రాంతాల్లో �