Kakani Govardhan Reddy Comments On Chandrababu Naidu: ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడపై ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. పేదలకు ఇస్తున్న సెంట్ భూమి శవాన్ని పూడ్చుకోవడానికి సరిపోతుందంటూ చంద్రబాబు అహంకారంగా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీల పేర్లతో రైతుల నుంచి చంద్రబాబు భూములు లాక్కున్నారని, పేదలకు సొంతింటి కల నిజం కాకుండా పలుమార్లు అడ్డుకున్నారని ఆరోపణలు చేశారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లు కట్టుకుంటే ఎందుకు బాధ? అని ప్రశ్నించారు. అమరావతి భూములను బంగారు బాతులాగా వాడుకోవాలని చూశారని అన్ననారు. అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఎందుకివ్వలేదని నిలదీశారు. ప్రస్తుతం అర్హులందరికీ ఇళ్లు ఇస్తున్నామని, పేదింటి సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్ నిజం చేస్తున్నారని అన్నారు.
Rs. 2000 Notes withdrawn: రూ.2000 నోటు రద్దు.. రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం..
చంద్రబాబు మదమెక్కి మాట్లాడుతున్నారని.. ఇలాంటి వ్యక్తికి రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని కాకాణి గోవర్ధన్ ధ్వజమెత్తారు. తన కొడుకు లోకేష్ కూడా తనను మోసం చేస్తాడనే అనుమానం చంద్రబాబుకు ఉందని అభిప్రాయపడ్డారు. రైతుల ఉచిత బీమాకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. బడ్జెట్ ప్రసంగంలోనే తాము పూర్తి వివరాలు వెల్లడించామని.. బీమా కింద రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చెప్పారు. తక్కువ సనయంలోనే పంటల నష్టాన్ని అంచనా వేసి, పరిహారం ఇస్తున్నామన్నారు. దిగుబడి లేదా వాతావరణ కారణాల వల్ల పంటకు నష్టం జరిగితే.. వాటికి పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. రైతుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోందన్నారు. దేశంలో ఆంధ్ర రాష్ట్రమే ఈ విధానాన్ని అమలు చేస్తోందని అన్నారు. ఏదో ఒక విధంగా ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఫైరయ్యారు. రైతులు నష్టపోకుండా చూస్తున్నామన్న ఆయన.. రైతులు ఎవరూ ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.
Extramarital Affair: ప్రియుడితో భర్తని చంపించిన భార్య.. లైవ్‌లో చూస్తూ ఎంజాయ్ చేసింది