Wife Killed Her Gymtrainer Husband With Help Of Lover In Hyderabad: వివాహేతర సంబంధం మోజులో కొందరు మహిళ దారుణాలకు పాల్పడుతున్నారు. కట్టుకున్నవారినే కడతేర్చుతున్నారు. ఆ తర్వాత హత్యను ప్రమాదంగా చిత్రీకరించి, తప్పించుకోవడానికి కథలు అల్లుతున్నారు. చివరికి అడ్డంగా దొరికిపోతున్నారు. ఇప్పుడు మహిళ కూడా అలాంటి ఘాతుకానికే పాల్పడి, కటకటకాలపాలైంది. ప్రియుడితో కలిసి ఉండటం కోసం.. అత్యంత కిరాతకంగా తన భర్తను హత్య చేయించింది. ప్రియుడు తన భర్తని చంపుతుంటే, లైవ్‌లో చూస్తూ ఎంజాయ్ చేసింది కూడా! సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
KA Paul : వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రూ. 4 వేల కోట్లు ఇస్తా..
కృష్ణా జిల్లా మట్టం గ్రామానికి చెందిన జయకృష్ణ(36), దుర్గా భవానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు హైదరాబాద్‌కు వలసవచ్చి, జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆల్విన్‌కాలనీ కమలాప్రసన్న నగర్‌లో నివాసం ఉంటున్నారు. జయకృష్ణ జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. అయితే దుర్గా భవానీ కొన్నేళ్లుగా జయకృష్ణ స్నేహితుడు చిన్నాతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తొలుత గుట్టుగా తమ సంబంధాన్ని వీళ్లు కొనసాగించారు. అయితే.. ఏడాది క్రితం వీరి బాగోతం బయటపడింది. అప్పుడు భర్త ఇద్దరిని మందలించాడు. అయినా సరే.. ఆ ఇద్దరిలో మార్పు రాలేదు. అతని ముందు నటిస్తూ.. వెనుక తమ రాసలీలలు కొనసాగించారు.
Junmoni Rabha: మలుపులు తిరుగున్న “లేడీ సింగం” మృతి కేసు.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు..
కట్ చేస్తే.. జయకృష్ణ తన సొంతూరులో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 10వ తేదీన ఇంటిని ఖాళీ చేసి, కుటుంబాన్ని తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. అయితే.. సొంతూరుకి వెళ్లిపోతే, తన ప్రియుడ్ని కలవలేనన్న ఉద్దేశంతో, భర్త అడ్డు తొలగించాలని దుర్గ భవాని పన్నాగం వేసింది. ప్రియుడు చిన్నాతో కలిసి పథకం రచించింది. పథకం ప్రకారం.. దుర్గ ఊరికి వెళ్లింది. చిన్నా ఇక్కడ జయకృష్ణ ఇంటికి వెళ్లి, మద్యం తాగించాడు. మద్యం మత్తులో అతడు బెడ్రూంలో పడిపోగా.. చిన్నా అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అప్పుడు దుర్గకి వీడియో కాల్ చేయగా.. మంటల్లో కాలిపోతున్న భర్తని చూస్తూ ఆమె ఎంజాయ్ చేసింది.
NTR30: ‘దేవర’ టైటిల్ నాది.. నా టైటిల్ కొట్టేశారు.. బాంబ్ పేల్చిన బండ్లన్న
అంతేకాదు.. వీడియో కాల్‌లోనే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు చిన్నాకి సలహాలు ఇచ్చింది. ఈ ఘటనని ఆత్మహత్యగా చిత్రీకరించేలా ప్రియుడికి సూచనలు ఇచ్చింది. అనంతరం.. ఆర్థిక ఇబ్బందులతో తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని నమ్మించేందుకు నాటకం ఆడింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుర్గపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా.. వివాహేతర సంబంధం కోసమే ప్రియుడు చిన్నాతో కలిసి భర్తని చంపించినట్టు తెలిపింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని.. రిమాండ్‌కు తరలించారు.