పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ మధ్య మొదట్నుంచి అక్రమ పొత్తులున్నాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు కూటమికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ రాజకీయ వ్యభిచారి అని.. బీజేపీ పక్కన ఉంటూ చంద్రబాబుకు సిగ్నల్ ఇస్తుంటే ఏం అంటారని జోగి రమేష్ ప్రశ్నించారు. టీడీపీ, జనసేన పొత్తుతో తమకు పోయేదేమీ లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎవరి వల్ల అందుతున్నాయో ప్రజలకు తెలుసన్నారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని పవన్ అంటున్నారని, అది నిజమేనన్నారు. వైసీపీ 151కి పైగా స్థానాలను చేజిక్కించుకోవడమే ఆ అద్భుతం అని జోగి రమేష్ వెల్లడించారు. అంతేతప్ప పవన్ మనసులో అనుకుంటున్న విధంగా ఏదీ జరగదని జోగి రమేష్ పేర్కొన్నారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే చేస్తాననే చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు.
Pawan Kalyan: నేను సింగిల్‌గా రావాలని చెప్పడానికి వైసీపీ వాళ్లెవరు?