Sajjala Ramakrishna: సజ్జల వద్దకు తాడికొండ పంచాయితీ.. ఆయన్ను తొలగించాలని శ్రీదేవి డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. తాడికొండ పంచాయితీ ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వదరకు చేరడంతో ఇది చర్చకు దారితీస్తోంది. అయితే.. తాడికొండ నియోజకవర్గ వైసిపి అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను నియమించడంపై స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో పాటు ఆమె వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక డొక్కాను వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని ఎమ్మెల్యే వర్గం డిమాండ్ చేస్తోంది. ఈనేపథ్యంలో.. తాజాగా ఎమ్మెల్యే శ్రీదేవి భారీగా అనుచరగణంతో సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసారు. ఇక తాడికొండ బాధ్యతలు డొక్కాకు అప్పగించడంతో స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని, వెంటనే ఆయనను తొలగించాలని శ్రీదేవి డిమాండ్ చేసారు. అంతేకాకుండా.. అదనపు ఇన్ చార్జ్ నియామకంతో నియోజకవర్గంలో తన ఇమేజ్ డ్యామేజీ అవుతుందని.. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వరనే ప్రచారం కూడా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారామె. ఇక వైసీపీ గెలిచిన 151 నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల స్థానిక ఎమ్మెల్యేలపై కంప్లయింట్లు ఉన్నాయి.
మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై సీఎం జగన్ అసంతృప్తితో ఉన్నారని టాక్. అంతేకాదు, గడప గడపలో పాల్గొనకపోవడం.. ప్రజల్లోకి వెళ్లకపోవడం.. నియోజకవర్గాలకు దూరంగా ఉండటం. ఇలా కొన్ని కారణాలతో ఎమ్మెల్యేల విషయంలో జగన్ ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాడికొండలో డొక్కాకు అదనపు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. దీంతో.. ఎమ్మెల్యే శ్రీదేవి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవుతోంది. ఇక నియోజకవర్గంలోకి వస్తున్న డొక్కా మాణిక్యవరప్రసాద్ కు అడుగడుగునా శ్రీదేవి మద్దతుదారులు అడ్డుపడుతున్నారు. దీంతో.. వైసీపీలో ఈ అంతర్గత పోరు ప్రతిపక్షాలకు అనుకోని ఆయుధంగా మారుతోంది. ఇక శ్రీదేవి బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలకు జగన్ చెక్ పెడతారని.. వారంతా ఆల్టర్నేట్ వెదుక్కోవాల్సిన అవసరం వస్తుందని అంటున్నారు.
Also Read
- YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- Botsa Satyanarayana: లోకేష్ రాజీనామా చేయాలి.. రాబోయే అసెంబ్లీ సమావేశాలపై బొత్స కీలక వ్యాఖ్యలు
- TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
ఇక గతంలో గన్నవరం పంచాయితీ కూడా ఇలాగే హాట్ హాట్ గా సాగి ముగిసిపోయింది. అంతేకాదు హిందూపురం విషయంలో అంతర్గత పోరు ఇంకా సమసిపోలేదు. మరోసారి ఇప్పుడు కొత్తగా తాడికొండ నియోజకవర్గం గొడవ మొదలైంది. దీంతో.. ఈ పంచాయితీ సజ్జల వద్ద ఫైనల్ అవుతుందా.. లేక సీఎం వద్దకు వెళ్తుందా అనేది వేచి చూడాలి.
Nellore YCP : నెల్లూరు వైసీపీలో ఆయన రాజకీయ స్టైలే వేరు.. అందుకే స్వపక్షంలో విపక్షంగా శ్రీధర్ రెడ్డి
తాజావార్తలు
-
YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Yash – Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
-
YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ట్రెండింగ్
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!