Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
- భారత్లో ఉద్యమానికి బంగ్లాదేశ్ స్పూర్తి..
- రాజకీయ దుమారానికి దారి తీసిన నేహా బోరా వ్యా్ఖ్యలు..
- బంగ్లాదేశ్ పరిస్థితులు తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తోందని బీజేపీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Neha Bora: భారత్లో కేంద్ర ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(CJP), వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. తమ ఉద్యమానికి బంగ్లాదేశ్లో జరిగిన విద్యార్ధి ఉద్యమమే స్పూర్తి అని AISA విద్యార్థి నాయకురాలు నేహా బోరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు భారతదేశంలో పాలనమార్పు( రెజిమ్ చేంజ్) లక్ష్యాన్ని సూచిస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు.
నేహా బోరా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్లో ప్రస్తుతం కనిపిస్తున్న జెన్జీ ఉద్యమం ముందుగా బంగ్లాదేశ్లో మొదలైందని అన్నారు. ‘‘ఈ దేశంలో మనం చూస్తున్న జెన్జీ ఉద్యమం మొదట బంగ్లాదేశ్లో ప్రారంభమైంది. మాకు దారి చూపినందుకు, ఈ దేశ యువతకు సంఘీభావం తెలిపినందుకు మీకు అభినందనలు’’ అని ఆమె ఆ వీడియోలో చెప్పింది. బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు 5న అప్పటి ప్రధాని షేక్ హసీనాను గద్దె దించేందుకు విద్యార్థులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఆమె భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. ఈ ఆందోళనల్లో మతోన్మాద సంస్థలైన జమాతే ఇస్లామీ వంటి సంస్థలు కూడా పాల్గొన్నాయి.
Also Read
- Nepal PM Balendra Shah: భారత్కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత ప్రదీప్ భండారీ నేహా బోరా వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న రాజకీయ వర్గాలు కేవలం రాజకీయంగా వ్యతిరేకించడమే కాకుండా, బంగ్లాదేశ్ తరహా అధికార మార్పును భారత్లో తీసుకురావాలని చూస్తున్నాయని ఆరోపించారు. నేహాబోరా వ్యాఖ్యలు భారత్లో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రజస్వామ్యానికి ప్రమాదకరమని ఆరోపించారు.
Neha Bora, Rahul Gandhi’s poster girl says-‘Bangladesh showed us the way’ for Revolution!
This is Open Admission of Regime Change!
Rahul Gandhi& Co are a threat to Indian Democracy! https://t.co/Eoi7QVzAtW
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) October 14, 2026
తాజావార్తలు
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
-
WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..