ఆంధ్రప్రదేశ్ లో మెగా టెర్మినల్స్ నిర్మించేందుకు రైల్వే శాఖ భారీ ఎత్తున ప్లాన్ చేస్తుంది. అమరావతి, గన్నవరం వంటి ఏరియాల్లో మెగా టెర్మినల్స్ నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. . అమరావతి మీదుగా ఫ్యూచర్ లో పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలు ప్రయాణించే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Read Also: Anushka Jaiswal: కార్పొరేట్ జాబ్ వదిలి.. కూరగాయలు పండిస్తూ.. ఏడాదికి రూ. కోటి
పూర్త వివరాల్లోకి వెళితే.. అమరావతి, గన్నవరం ప్రాంతాల్లో మెగా టెర్మినల్స్ నిర్మించేందుకు భారీ ఎత్తున రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైళ్లు ప్రయాణించే అవకాశం లేకపోలేదు. దీంతో ఫ్లాట్ ఫామ్‌లో తో టెర్మినల్ నిర్మాణానికి రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అదే సమయంలో విజయవాడ రైల్వే స్టేషన్ పై ఒత్తిడి తగ్గించేలా గన్నవరం టెర్మినల్ అభివృద్ధి చేయబోతున్నారు. దీంతో పాటు విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా మరిన్ని ఎక్కువ రైళ్ల రాకపోకలకు వీలుగా విస్తరణ పనులు కూడా చేపట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.
Read Also: Online Fruad: ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ బుక్ చేస్తే.. ఏం వచ్చిందో తెలుసా..
రాజధాని మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 56 కిలో మీటర్ల కొత్త రైల్వే కూడా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అమరావతి ప్రధాన స్టేషన్ ను మెగా కోచింగ్ టెర్మినల్ గా నిర్మించబోతున్నారు. ఇందులో ఎనిమిది రైల్వే లైన్లు అలాగే 8 ఫ్లాట్ ఫామ్ లు నిర్మించనున్నట్లు సమాచారం. ఈ స్టేషన్ గుండా 120 రైళ్లు ప్రయాణించే అవకాశాలు ఉన్నట్లు.. రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు. టెర్మినల్ కోసం 300 ఎకరాలు అవసరమవుతాయని రైల్వే శాఖ అంచనా వేసింది. దీంతో రైల్వే శాఖ ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి వెల్లడించింది. అదే విధంగా గన్నవరం రైల్లే స్టేషన్ ను మెగా కోచింగ్ టెర్మినల్ గా అభివృద్ధి చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. దీని నిర్మాణం కోసం 143 ఎకరాలు కావాల్సి ఉంది.