ఆనందయ్య తయారు చేసిన మెడిసిన్ ఆయుర్వేదమా కాదా అని నిర్ధారించేందుకు పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయుష్ సంస్థ ఈ మెడిసిన్ పై అద్యయనం మొదలుపెట్టింది. ఈ మెడిసిన్ వినియోగించిన వస్తువులు అన్నీ కూడా ఆయుర్వేదంలో వినియోగించే వస్తువులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ మెడిసిన్ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేవని ఆయుష్ తెలిపింది. అయితే, ఐసీఎంఆర్ నిపుణులు ఈ మందును పరిశీలించాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ మందును ఐసీఎంఆర్ పరిశీలించాల్సిన అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ ఈ మెడిసిన్ ను పరీశీలిస్తోంది. ఆయుష్ నివేదికను ఆయుర్వేదిక్ సైన్స్ పరిశీస్తోంది. ఈ పరిశీలన అనంతరం తుది నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నది. ఆయుష్, సిసిఆర్ఏఎస్ ఆనందయ్య మందు ఆయుర్వేదమే అని తేల్చితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మెడిసిన్ ను పంపిణీ చేసే అవకాశం ఉంటుంది.