పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్త జల్లయ్య హత్యతో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆయన కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను శనివారం పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి నర్సరావుపేటలో టీడీపీ నేతలు పర్యటించాలని తలపెట్టారు. సోమవారం నాడు వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం రావులాపురంలో టీడీపీ బీసీ నేతలు పర్యటించనున్నారు. ప్రత్యర్థుల చేతిలో హతుడైన జల్లయ్య కుటుంబాన్ని వాళ్లు పరామర్శించనున్నారు. Ganta Srinivasrao: టెన్త్ ఫలితాలు వాయిదా వేయడం…