Union Budget 2024 For Sports: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ.3,442.32 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే.. ఈసారి క్రీడలకు 45.36 కోట్లు అదనంగా కేటాయించారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేలో ఇండియా’కు అత్యధికంగా రూ.900 కోట్లు కేటాయించారు. ఖేలో ఇండియాకు గతంలో కంటే రూ.20 కోట్లు పెంచారు.
కేంద్ర వార్షిక బడ్జెట్‌లో నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్‌లకు రూ.340 కోట్లు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రూ.822.60 కోట్లు కేటాయించారు. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)కు రూ.22.30 కోట్లు, నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ (ఎన్‌డిటిఎల్)కు రూ.22 కోట్లు కేటాయించారు. నాడా, ఎన్‌డిటిఎల్ బడ్జెట్‌లలో స్వల్ప పెరుగుదల కనిపించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 48.2 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.