గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో కొత్త 4,687 అంగన్వాడీ హెల్పర్లు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. రాష్ట్రంలో ఉన్న 4,687 మినీ ఆంగన్వాడీ కేంద్రాలను మెయిన్ ఆంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయనుంది.. ఈ అప్‌గ్రేడ్ కారణంగా, కొత్తగా 4,687 హెల్పర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
అతి భారీ వర్షాలు ఏజెన్సీ వ్యాప్తంగా కురుస్తున్నాయి. ఏజెన్సీలో వాగులు, గెడ్డల ఉధృతి కొనసాగుతుంది. గత వారం రోజులుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వందలాది గిరిజన గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటేనే బిందాస్.. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఇబ్బందులు వచ్చినా.. ఆ తర్వాత మళ్లీ నిలదొక్కుకున్నాయి ఐటీ సంస్థలు.. అయితే, ఇప్పుడు మళ్లీ ఐటీ ఉద్యోగులను కష్టాలు వెంటాడుతున్నాయి.. ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కేలా మెటా, ట్వి టర్, సేల్స్ ఫోర్స్ , మైక్రోసాఫ్ట్, స్ట్రైప్లు ఇలా దిగ్గజ సంస్థలు అన్ని ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి.. ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చేస్తున్నాయి.. ఇప్పుడు ఆ జాబితాలో మరో ఐటీ దిగ్గజ సంస్థ సిస్కో…
దసరా పండుగ సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్వయంగా వెల్లడించారు.. దసరా సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ భక్తుల సౌకర్యం కోసం స్పెషల్ బస్సులను తిప్పనున్నాం.. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు 4500 స్పెషల్ బస్సులు నడుపుతామని తెలిపారు.. 2100 ఫ్రీ దసరా బస్సులు నడుపుతాం.. సాధారణ ఛార్జీలతోనే అదనపు బస్సులు తిప్పుతామని స్పష్టం…
పండుగలు వచ్చాయంటే చాలు.. పట్టణాల్లో స్థిరపడినవారు సైతం.. తాను పుట్టిన ప్రాంతానికి వెళ్లడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.. దీంతో, రద్దీ పెరిగిపోతోంది.. అయితే, రానున్న దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. ప్రత్యేకంగా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.. ఈ బస్సులు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఇక, పండుగన సీజన్‌లో ప్రత్యేక బస్సులను…